ప్రపంచమంతా పీలుస్తోంది... విషాన్నే!
ప్రపంచమంతా కాలుష్యకోరల్లో కూరుకుపోతోంది. నూటికి 90 శాతం మంది పీలుస్తోంది కాలుష్యపు గాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ హెచ్ ఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఒకప్పుడు పట్టణాల్లోనే ఈ ప్రమాదం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం.. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా కాలుష్యపు విషకోరలు గాలి మొత్తం వ్యాపించాయి. ఏ ప్రాంతంలోని గాలైనా సల్ఫర్, కార్బన్ డై యాక్సయిడ్, కార్బన్ మోనాక్సయిడ్ ఇతర విషవాయువులతో నిండి పోయింది. ఆస్తమా, సైనసైటిస్, ఊపిరితిత్తుల వ్యాధులు, […]
BY sarvi28 Sept 2016 3:20 AM IST
X
sarvi Updated On: 28 Sept 2016 3:39 AM IST
ప్రపంచమంతా కాలుష్యకోరల్లో కూరుకుపోతోంది. నూటికి 90 శాతం మంది పీలుస్తోంది కాలుష్యపు గాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ హెచ్ ఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఒకప్పుడు పట్టణాల్లోనే ఈ ప్రమాదం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం.. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా కాలుష్యపు విషకోరలు గాలి మొత్తం వ్యాపించాయి. ఏ ప్రాంతంలోని గాలైనా సల్ఫర్, కార్బన్ డై యాక్సయిడ్, కార్బన్ మోనాక్సయిడ్ ఇతర విషవాయువులతో నిండి పోయింది. ఆస్తమా, సైనసైటిస్, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ రోగాలతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 92 శాతం మంది ప్రజలు బాధపడుతున్నారు. ఇలాంటి వ్యాధుల బారిన పడి ఏటా 64 లక్షలమంది మరణిస్తున్నారు. వీటిలో ఏటా 8 లక్షల మందికిపైగా మరణాలు భారత్, చైనా, ఆగ్నేయాసిలోనే చోటు చేసుకుంటున్నాయి. పట్టణాల్లో పరిశ్రమలు, థర్మల్ వ్యర్థాలు, ఫార్మా కంపెనీలు, వాహనాలు విడుదల చేసే పొగ, కట్టడాల కూల్చివేత, పారిశ్రామిక వ్యర్థాల కాల్చివేత ఇతర కారణాల వల్ల గాలికాలుష్యమవుతోంది. పల్లెల్లో కట్టెల పొయ్యిలు, పిడకల వినియోగం, పెరిగిన వాహనాల వల్ల విషవాయువులు గాలిలో కలుస్తున్నాయి.
Click on Image to Read:
Next Story