నయీం డెన్‌ని గుర్తించిన పోలీసులు? డబ్బు ఏమైంది?
అమాయకులను బెదిరించి.. హింసించి..హతమార్చి అక్రమంగా కూడబెట్టిన డబ్బులన్నీ నయీం ఏం చేశాడు. మావోయిస్టు నేపథ్యమున్న నయీం ఈ డబ్బును తాను నివసించే ఇళ్లలో ఏనాడూ దాచిపెట్టలేదు. సిట్ పోలీసులు ఎంత గాలించినా.. రూ.20 కోట్ల కంటే ఎక్కువ నగదు దొరకలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. నయీం అనుచరులు, కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయం తెలిసింది. మావోయిస్టుగా పనిచేసినంత కాలం అక్కడ డంపుల నిర్వహణ చూసిన అనుభవంతో గ్యాంగ్‌స్టర్‌గా మారిన తరువాతా అదే పంథాను అనుసరించాడని […]
BY sarvi26 Sept 2016 11:07 PM GMT
X
sarvi Updated On: 27 Sept 2016 2:23 AM GMT
అమాయకులను బెదిరించి.. హింసించి..హతమార్చి అక్రమంగా కూడబెట్టిన డబ్బులన్నీ నయీం ఏం చేశాడు. మావోయిస్టు నేపథ్యమున్న నయీం ఈ డబ్బును తాను నివసించే ఇళ్లలో ఏనాడూ దాచిపెట్టలేదు. సిట్ పోలీసులు ఎంత గాలించినా.. రూ.20 కోట్ల కంటే ఎక్కువ నగదు దొరకలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. నయీం అనుచరులు, కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయం తెలిసింది. మావోయిస్టుగా పనిచేసినంత కాలం అక్కడ డంపుల నిర్వహణ చూసిన అనుభవంతో గ్యాంగ్‌స్టర్‌గా మారిన తరువాతా అదే పంథాను అనుసరించాడని తెలిసింది. దీంతో డంపులు ఎక్కడున్నాయి? అన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు.
డంపుల సమాచారాన్ని నయీం ఎవరితోనూ పంచుకునేవాడు కాదని తెలిసింది. ఆ విషయాలన్నీ అతని కుడిభుజం శేషన్నకే తెలుసని నయీం అనుచరులు వెల్లడించారు. నయీం ఎన్‌కౌంటర్ తరువాత శేషన్న అజ్ఞాతంలోరి వెళ్లిపోయాడు. అతడు నల్లమల అడవుల్లో సంచరిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఇప్పటికే కూంబింగ్ మొదలు పెట్టారు. ఇప్పటి దాకా శేషన్న ఆచూకీ చిక్కలేదు. కానీ, అతని అనుచరుడు ఈశ్వరయ్యను పోలీసులు 15 రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈశ్వరయ్య ద్వారా నయీమ్‌కు సంబంధించిన డంప్‌లు, ఇతర డెన్‌ల వివరాలు పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. మరి నయీం గురించి తెలుసుకున్న కొత్త డెన్‌లలో ఏం దొరుకుతుందన్న ఉత్కంఠ పోలీసుల్లో నెలకొంది. భారీగా నగదు దొరికే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోన్న క్రమంలో డెన్ ల గురించి ఏం తెలుస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story