Telugu Global
NEWS

రేవంత్‌పై చ‌ర్య‌కు చంద్ర‌బాబు సాహ‌సిస్తాడా?

తెలంగాణ టీడీపీలో అంత‌ర్గ‌త విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం అధ్య‌క్షుడు ర‌మ‌ణ‌కు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా సీనియ‌ర్ల‌ను కాద‌ని దుందుడుకు వైఖ‌రితో ముందుకెళ్తున్న రేవంత్‌పై ఆ నాయ‌కులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో అధ్య‌క్షుడు సీటును దాదాపుగా రేవంత్ క‌బ్జా చేశాడ‌ని సొంత పార్టీ నాయ‌కులే చెప్పుకుంటున్నారు. రేవంత్ దూకుడు విష‌యంలో ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్లు చంద్ర‌బాబుకు, లోకేశ్ కు ఫిర్యాదులు […]

రేవంత్‌పై చ‌ర్య‌కు చంద్ర‌బాబు సాహ‌సిస్తాడా?
X
తెలంగాణ టీడీపీలో అంత‌ర్గ‌త విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం అధ్య‌క్షుడు ర‌మ‌ణ‌కు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా సీనియ‌ర్ల‌ను కాద‌ని దుందుడుకు వైఖ‌రితో ముందుకెళ్తున్న రేవంత్‌పై ఆ నాయ‌కులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో అధ్య‌క్షుడు సీటును దాదాపుగా రేవంత్ క‌బ్జా చేశాడ‌ని సొంత పార్టీ నాయ‌కులే చెప్పుకుంటున్నారు. రేవంత్ దూకుడు విష‌యంలో ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్లు చంద్ర‌బాబుకు, లోకేశ్ కు ఫిర్యాదులు చేసినా ఉప‌యోగం లేక‌పోయింది. ఈ ప‌రిణామాల‌న్నీ ప‌రోక్షంగా రేవంత్ కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్ల‌యింది. దీంతో రేవంత్ మ‌రింత చెల‌రేగిపోతున్నాడు. ఎక్క‌డ పార్టీ కార్యక్ర‌మాలు నిర్వ‌హించినా సీనియ‌ర్ల‌ను కాద‌ని సొంత ఎజెండాతో ఎలా ముందుకు పోవడంపై సీనియ‌ర్లు మండిప‌డుతున్నారు. దీంతో పార్టీలో ద్వితీయ శ్రేణి, కార్య‌క‌ర్త‌లు అంతా అయోమ‌యంలో ప‌డుతున్నారు. పార్టీ అధ్య‌క్షుడి మాట వినాలా? వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాట వినాలా? అనే సందిగ్ధ‌స్థితిలో ప‌డిపోయారు.
తెలుగుదేశం పార్టీలో ర‌మ‌ణ చాలా సీనియ‌ర్‌.. పార్టీ ఆవిర్భావం నుంచి విధేయుడిగా ప‌నిచేస్తూ వ‌స్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో గుర్తింపు పొందిన సీనియ‌ర్ బీసీ నేత‌. పార్టీ కోసం ద‌శాబ్దాలుగా క‌ష్ట‌ప‌డుతున్న వారిని వ‌దిలేసి.. నిన్న గాక మొన్న వ‌చ్చిన రేవంత్ కు బాబు వ‌ర్గం ప‌రోక్షంగా మ‌ద్ద‌తిస్తోంద‌నే ప్ర‌చారం పార్టీలో పాతుకుపోయింది. అందుకే, రమ‌ణ వ‌ర్గం ఈ విష‌యంలో తీవ్ర అసంతృప్తిగా ఉంది. మ‌హానాడు, ఇత‌ర నిర‌స‌న‌ల కార్య‌క్ర‌మాల్లో రేవంత్ ఎక్క‌డా ర‌మ‌ణ‌ను సంప్ర‌దించ‌లేద‌ని స‌మాచారం. త‌న‌కు తానుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌ను రూపొందించ‌డం, ఆ సంద‌ర్భంగా పెట్టే ప్లెక్సీల్లో ర‌మ‌ణ ఫొటోను చేర్చ‌క‌పోవ‌డం సీనియ‌ర్ల‌కు రుచించ‌డం లేదు. దీంతో ఈ విష‌యాన్ని బాబు వ‌ద్ద తాడో పేడో తేల్చుకోవాల‌ని సిద్ధ‌మ‌వుతున్నారు. కానీ, ఓటుకు నోటు కేసు మ‌రోసారి విచార‌ణ‌కు వ‌చ్చిన ఈ స‌మ‌యంలో రేవంత్ దూకుడుకు చంద్ర‌బాబు క‌ళ్లెం వేయ‌గ‌ల‌డా అన్న‌ది అనుమాన‌మే!
First Published:  27 Sept 2016 7:45 AM IST
Next Story