Telugu Global
NEWS

టీడీపీ ఎమ్మెల్యే దందాపై రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్

రాపూరు- కృష్ణపట్నం మధ్య రైల్వే పనులు జరగాలంటే తనకు రూ. 5కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయిన టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ ఉదంతం తీవ్రరూపం దాల్చేలా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే దందాను తెలుగు టీవీ చానళ్లు పెద్దగా ప్రసారం చేయకపోయినప్పటికీ… ఈ అంశం కేంద్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుమారుడు శివకుమార్ కూడా గుంటూరు జిల్లాలో ఇలాగే రైల్వే పనులు అడ్డుకున్న నేపథ్యంలో […]

టీడీపీ ఎమ్మెల్యే దందాపై రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్
X

రాపూరు- కృష్ణపట్నం మధ్య రైల్వే పనులు జరగాలంటే తనకు రూ. 5కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయిన టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ ఉదంతం తీవ్రరూపం దాల్చేలా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే దందాను తెలుగు టీవీ చానళ్లు పెద్దగా ప్రసారం చేయకపోయినప్పటికీ… ఈ అంశం కేంద్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుమారుడు శివకుమార్ కూడా గుంటూరు జిల్లాలో ఇలాగే రైల్వే పనులు అడ్డుకున్న నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. అసలు ఏపీలో ఏం జరుగుతోందన్న దానిపై ఆరా తీస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ నిజరూపాన్ని బయటపెట్టిన గుజరాత్‌ కంపెనీ మాంటెకార్లో ప్రతినిధులను సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీం ప్రశ్నించింది. ఎమ్మెల్యే బెదిరింపులపై వివరాలు సేకరించారు. ఆడియో టేపుల కాపీలను కూడా కంపెనీ ప్రతినిధుల నుంచి తీసుకున్నారు.

ఏపీలో రైల్వే పనులు చేయడం పెద్ద చాలెంజ్‌గా తయారైందని ఇప్పటికే రైల్వే బోర్డు అధికారులు కూడా కేంద్రం దృష్టికి తెచ్చారు. కొద్ది రోజుల క్రితమే ఏపీ సీఎస్‌కు రైల్వే బోర్డు ఉన్నతాధికారులు ఘాటుగా లేఖ రాశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో రైల్వే పనులు చేయాలో వద్దో స్పష్టం చేయాలని లేఖరాసింది. అయినా సరే టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా రూ. 5కోట్లు డిమాండ్ చేస్తూ పట్టుబడడంతో సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. మరోవైపు రామకృష్ణ వ్యవహారంపై నెల్లూరు జిల్లా టీడీపీ నేతలతో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుధీర్ఘంగా సమావేశం నిర్వహించారు. తొలుత రామకృష్ణ మీడియా ముందుకు వచ్చి జరిగిన దానిపై వివరణ ఇస్తారని టీడీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. అయితే ప్రెస్‌మీట్ పార్టీ కార్యాలయంలో ఉండదని హోటల్‌లో ఉంటుందని మరోసారి ప్రకటించారు. తీరా చూస్తే రామకృష్ణ అసలు మీడియా ముందుకే రాలేదు. మాంటెకార్లో సంస్థ మాజీ ఉద్యోగి రామును మీడియా ముందుకు తెచ్చారు. అయితే ఆ వ్యక్తి మీడియా ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.

Click on Image to Read:

chandrababu-naidu-ramakrishna

konatala-ramakrishna

mla-ramakrishna

First Published:  27 Sept 2016 12:29 PM IST
Next Story