కష్టాలు కొని తెచ్చుకుంటున్న యంగ్ హీరో..!
గాలికి ఎదురీదలేనప్పు డు.. అనుకూలంగా వెళ్లడం ఉత్తమం . ఇండస్ట్రీలో ఎవరేది చెప్పినా.. సక్సెస్ కు మాత్రమే అల్టిమేట్ పవర్ వుంటుంది. అది అందిరికి తెలుసు. నిఖిల్ లాంటి హీరోలకు బాగా తెలుసు. ఎందుకంటే నిఖిల్ కు సక్సెస్ తెలిగ్గా రాలేదు. ఎన్నో పరాజయాలు ఎదుర్కొన తరువాత స్వామిరారా.. కార్తీకేయ చిత్రాలు హీరోగా ఎస్టాబ్లీష్ చేశాయి. నిఖిల్ నటించిన ప్రతి చిత్రం మినిమమ్ గ్యారెంటి అనిపించుకోవాల్సిందే. అయితే శంకరాభరణం సినిమా నిఖిల్ కు బాగా ఝలక్ ఇచ్చింది. […]
గాలికి ఎదురీదలేనప్పు డు.. అనుకూలంగా వెళ్లడం ఉత్తమం . ఇండస్ట్రీలో ఎవరేది చెప్పినా.. సక్సెస్ కు మాత్రమే అల్టిమేట్ పవర్ వుంటుంది. అది అందిరికి తెలుసు. నిఖిల్ లాంటి హీరోలకు బాగా తెలుసు. ఎందుకంటే నిఖిల్ కు సక్సెస్ తెలిగ్గా రాలేదు. ఎన్నో పరాజయాలు ఎదుర్కొన తరువాత స్వామిరారా.. కార్తీకేయ చిత్రాలు హీరోగా ఎస్టాబ్లీష్ చేశాయి. నిఖిల్ నటించిన ప్రతి చిత్రం మినిమమ్ గ్యారెంటి అనిపించుకోవాల్సిందే. అయితే శంకరాభరణం సినిమా నిఖిల్ కు బాగా ఝలక్ ఇచ్చింది. కథ, కథనంలో దమ్ము లేక పోవడంతో ఒకింత ఫెయిల్యూర్ ను మూట కట్టుకుంది.
తాజాగా చేస్తున్న “ఎక్కడకు పోతావు చిన్నవాడా..” సినిమాకు హీరోయిన్లు వీళ్లు అనుకుని, వాళ్లు అనుకుని, ఆలస్యంగా చివరికి నివేథా థామస్, అవిక గౌర్, హెబ్బా పటేల్ లాంటి యంగ్ హీరోయిన్లు ముగ్గురు సెట్ అయ్యారు. కానీ సినిమా నిర్మాణంలో అడుగడుగునా ఏదో ఒక అడ్డంకి వస్తూనే వుంది. హీరోయిన్ల డేట్ల సమస్య, షూటింగ్ సమస్య, ఫైనాన్స్ సమస్య, ఇలా ఒకదాని తరువాత ఒకటి. ఆఖరికి కొద్ది రోజులు షూటింగ్ వుంది అని చిక్ మంగుళూరు వెళ్తే, కావేరీ జలాల సమస్య, మూడు రోజులు షూటింగ్ బకాయి వుండగానే వెనక్కు రావాల్సి వచ్చింది.
దీనికి తోడు నిర్మాతకు డైరక్టర్ కు సింక్ కావడం లేదని వినికిడి. ఇప్పుడు మూడు రోజులు హెబ్బా పటేల్ తో వర్క్ వుంది. దానికి ఓ కేవ్ కావాలి. దాని కోసం విదేశాలకు వెళ్దాం అంటారు హీరో, డైరక్టర్. ఇక నా వల్ల కాదు, ఇప్పటికే ఖర్చు ఎనిమిది కోట్లు దాటేసింది..ఇక్కడే ఎక్కడో తీసుకోండి అంటారు నిర్మాత. ఈలోగా ఈ సీన్ లో పాల్గొనాల్సిన హెబ్బా అవుట్ డోర్ కు వెళ్లిపోయింది వేరే సినిమా కోసం. ఇంకేముంది..మళ్లీ గ్యాప్. నిర్మాత ఓవర్ బడ్జెట్ చేసేశారని అంటున్నట్లు టాక్. చిక్ మంగుళూరు కు వెళ్లి, అక్కడ సెట్ కోసం పాతిక మందికి పైకా కార్పెంటర్లను తీసుకెళ్లారట. దీంతో అక్కడ ఖర్చు తడిసి మోపెడయ్యిందని వినికిడి. ఇప్పుడు మూడు రోజుల కేవ్ వర్క్ కోసం విదేశాలకు అంటే మళ్లీ నా వల్ల కాదని నిర్మాత అంటున్నట్లు తెలుస్తోంది.
మంచి ప్రాజెక్టు..మంచి కథ, బాగా వస్తోందని ఇన్ సైడ్ టాక్. కానీ ఏం లాభం, ఇన్ టైమ్ లో రెడీ చేసుకుని, విడుదల చేసుకోకపోతే. పైగా శంకరాభరణం వచ్చి డిసెంబర్ కు ఏడాది పూర్తవుతుంది. ఓ మీడియం రేంజ్ హీరో అంటే ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలి కదా?