తెలంగాణవాదులకు క్షమాపణలు చెప్పిన యండమూరి!
అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా ఉంది ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పరిస్థితి. తెలంగాణపై తీవ్ర స్థాయిలో విషం కక్కి మొత్తం రాష్ర్ట ప్రజలపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. అదీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో. దానిపై తీవ్ర దుమారం రేగడంతో చేసేది లేక క్షమాపణలు చెప్పుకున్నారు. వివరాలు.. తెలంగాణలో ఏ పుణ్యక్షేత్రం లేదు. తెలంగాణవాదులు కానుకల రూపంలో వేసే ఆదాయమంతా తిరుపతికి వెళ్లిపోతోంది. అందుకే, తెలంగాణలో నాలుగు కొండలు చూసి, అక్కడ విగ్రహం పెట్టి, […]
BY sarvi26 Sept 2016 4:19 AM IST
X
sarvi Updated On: 26 Sept 2016 5:42 AM IST
అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా ఉంది ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పరిస్థితి. తెలంగాణపై తీవ్ర స్థాయిలో విషం కక్కి మొత్తం రాష్ర్ట ప్రజలపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. అదీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో. దానిపై తీవ్ర దుమారం రేగడంతో చేసేది లేక క్షమాపణలు చెప్పుకున్నారు. వివరాలు.. తెలంగాణలో ఏ పుణ్యక్షేత్రం లేదు. తెలంగాణవాదులు కానుకల రూపంలో వేసే ఆదాయమంతా తిరుపతికి వెళ్లిపోతోంది. అందుకే, తెలంగాణలో నాలుగు కొండలు చూసి, అక్కడ విగ్రహం పెట్టి, వెలిసిందని ప్రచారం చేయించండి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లుగా ఇష్టానుసారంగా రాసుకొచ్చాడు. అంటే ఈయన అక్కసంతా యాదాద్రిమీద వెళ్లగక్కాడన్న మాట. యాదాద్రి రాత్రికి రాత్రి పాపులర్ అయ్యేలా కథలు దావానంలా వ్యాపించాలి అని కేసీఆర్ ఆదేశించినట్లు ఈయన ఓ కల్పిత వార్తను రాసుకొచ్చాడు.
దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నవలా రచయితగా మీరు లోకం తెలిసినవారు అనుకున్నాను గానీ, మీలో ఇంత ప్రాంతీయ విద్వేషం ఉందని ఊహించలేకపోయాం అంటూ ఎదురుతిరిగారు. నెటిజన్ల ఆగ్రహంతో చేసిన తప్పు తెలుసుకున్న యండమూరి క్షమాపణలు చెప్పారు. దీంతో యండమూరి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు, ఆయన క్షమాపణలు చెప్పిన వ్యాఖ్యలను స్ర్కీన్‌షాట్లు తీసి మరీ ఆయన చేసిన పనిని ఎండగడుతున్నారు తెలంగాణ నెటిజన్లు.
Next Story