కేటీఆర్ పై రాళ్లు విసిరిన సొంత ప్రజలు!
కాలం కలిసి రాకపోతే.. మిత్రుడు కూడా బద్దశత్రువుగామారతాడు. సరిగ్గా ఇలానే ఉంది మంత్రి కేటీఆర్ పరిస్థితి. తాజాగా మరోసారి కేటీఆర్‌కు సిరిసిల్ల ప్రజలు తమ నిరసనను తెలియజేశారు. తన నియోజకవర్గంలో నిండుకుండలా మారిన ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన మంత్రికి అడుగడుగునా నిరసనలతో స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. జిల్లా సాధన సమితి నేతలు, న్యాయవాద జేఏసీ నేతలు మంత్రి కారును అడ్డుకున్నారు. దీంతో లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. కోపంతో వారంతా మరింత చెలరేగిపోయారు. మంత్రి […]
BY sarvi26 Sept 2016 4:51 AM IST
X
sarvi Updated On: 26 Sept 2016 6:56 AM IST
కాలం కలిసి రాకపోతే.. మిత్రుడు కూడా బద్దశత్రువుగామారతాడు. సరిగ్గా ఇలానే ఉంది మంత్రి కేటీఆర్ పరిస్థితి. తాజాగా మరోసారి కేటీఆర్‌కు సిరిసిల్ల ప్రజలు తమ నిరసనను తెలియజేశారు. తన నియోజకవర్గంలో నిండుకుండలా మారిన ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన మంత్రికి అడుగడుగునా నిరసనలతో స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. జిల్లా సాధన సమితి నేతలు, న్యాయవాద జేఏసీ నేతలు మంత్రి కారును అడ్డుకున్నారు. దీంతో లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. కోపంతో వారంతా మరింత చెలరేగిపోయారు. మంత్రి కారుపై రాళ్లు విసిరారు. ప్రాజెక్టులు నిండాయని సంతోషంలో ఉన్న కేటీఆర్… సొంత ప్రజల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం ఊహించి ఉండదు.
సిరిసిల్లను జిల్లాగా చేస్తామని ఏ ముహూర్తాన ప్రభుత్వం ప్రతిపాదించిందో గానీ.. అప్పటి నుంచి ఆ మాటపై కోటి ఆశలు పెట్టుకున్నారు సిరిసిల్ల ప్రజలు. తీరా మొన్నటి తుదిజాబితాలో సిరిసిల్ల జిల్లా ప్రతిపాదన తూచ్ అనేసింది ప్రభుత్వం. దీంతో సిరిసిల్ల ప్రజల అరికాలి మంట నెత్తికెక్కింది. అప్పటి నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎండా, వాన తేడా లేకుండా నిరసనలు కొనసాగిస్తూనే ఉండటం గమనార్హం. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని కేటీఆర్ చేతులెత్తేసినా ప్రజలు శాంతించడం లేదు. చివరికి కేటీఆర్, సీఎం కేసీఆర్ ప్లెక్సీలు దహనం చేసే వరకు వచ్చింది పరిస్థితి. వర్షంలోనూ వారు ఆందోళనలు కొనసాగిస్తుండటం చూస్తుంటే నియోజకవర్గంలో కేటీఆర్ అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి ఈ విపత్తు నుంచి కేటీఆర్ బయటపడేది ఏనాడో.. సిరిసిల్ల జిల్లా ఉద్యమానికి పరిష్కారం లభించేది ఎప్పుడో?
Click on Image to Read:
Next Story