చిరంజీవి పై డైరెక్టర్ ఆరోపణలు!
డైరెక్టర్‌గా గీతా కృష్ణ చేసినవి పట్టుమని అరడజను సినిమాలకన్నా ఎక్కువ లేవు. కాని డిఫరెంట్ సినిమాలు తీస్తాడనేపేరు మాత్రం ఇప్పటికీ నిలిచి ఉంది. తన డైరెక్టోరియల్ డెబ్యూ నాగార్జునతో ‘సంకీర్తన’ అనే సినిమాతో మొదలయ్యింది. ఆ రోజుల్లో.. ఆ సినిమా పాటలు విన్న చిరంజీవి చాలా ఇన్‌స్పయిర్ అయ్యి మన కాంబినేషన్‌లో సినిమా చేద్దాము అని మాట ఇచ్చాడట. అదే సమయంలో చిరంజీవి మంచి సినిమాలు తీయలనే ఉద్ధేశ్యంతో ‘అంజనా ప్రొడుక్షన్స్’ స్థాపించి ‘రుద్రవీణ’ తీస్తున్నారట. అటు […]
BY sarvi26 Sept 2016 10:56 AM IST

X
sarvi Updated On: 26 Sept 2016 1:01 PM IST
డైరెక్టర్‌గా గీతా కృష్ణ చేసినవి పట్టుమని అరడజను సినిమాలకన్నా ఎక్కువ లేవు. కాని డిఫరెంట్ సినిమాలు తీస్తాడనేపేరు మాత్రం ఇప్పటికీ నిలిచి ఉంది. తన డైరెక్టోరియల్ డెబ్యూ నాగార్జునతో ‘సంకీర్తన’ అనే సినిమాతో మొదలయ్యింది. ఆ రోజుల్లో.. ఆ సినిమా పాటలు విన్న చిరంజీవి చాలా ఇన్‌స్పయిర్ అయ్యి మన కాంబినేషన్‌లో సినిమా చేద్దాము అని మాట ఇచ్చాడట. అదే సమయంలో చిరంజీవి మంచి సినిమాలు తీయలనే ఉద్ధేశ్యంతో ‘అంజనా ప్రొడుక్షన్స్’ స్థాపించి ‘రుద్రవీణ’ తీస్తున్నారట. అటు ‘సంకీర్తన’, ఇటు ‘రుద్రవీణ’ రెండూ క్రిటికల్ గా మంచి పేరు తెచ్చాయి కాని, బాక్సాఫిస్ వద్ద బోల్తా కొటాయి. ఆ తర్వాత, ఒకసారి గీతా కృష్ణ చిరంజీవి నటిస్తున్న ‘యముడికి మొగుడు’ సినిమా సెట్స్‌కి వెళ్లి పలకరించినా… ఇచ్చిన మాట గుర్తులేనట్లు పలకరించారట మామూలుగా. తనకు ఈగో అడ్డు వచ్చి గీతా కృష్ణ కూడా మారు మాట్లాడకుండా వచ్చేసాడట.
Next Story