ధోని లో కర్మ యోగిని చూసిన రాజమౌళి..?
కపిల్ దేవ్, సచిన్ , తరువాత ..ఇండియన్ క్రికెటర్స్ లో ఎక్కువుగా ప్రభావితం చేసిన క్రికెటర్ యం ఎస్ ధోని. గ్రౌండ్ లోనే కాదు.. అతని వ్యక్తిత్వం తో కూడా ఇంప్రెస్ చేయగలిగాడు ధోని. జార్ఘండ్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి క్రికెట్ మీద అపారమైన ప్రేమతో సాధన చేసి.. ఇంతింతై వటుడింతై అన్నచందంగా ఎదిగాడు. ముళ్ల కీరటం లాంటి ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టన్సీ ని చేప్పట్టి ఒంటి చెత్తో ఎన్నో చిరస్మరణియమైన […]
కపిల్ దేవ్, సచిన్ , తరువాత ..ఇండియన్ క్రికెటర్స్ లో ఎక్కువుగా ప్రభావితం చేసిన క్రికెటర్ యం ఎస్ ధోని. గ్రౌండ్ లోనే కాదు.. అతని వ్యక్తిత్వం తో కూడా ఇంప్రెస్ చేయగలిగాడు ధోని. జార్ఘండ్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి క్రికెట్ మీద అపారమైన ప్రేమతో సాధన చేసి.. ఇంతింతై వటుడింతై అన్నచందంగా ఎదిగాడు. ముళ్ల కీరటం లాంటి ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టన్సీ ని చేప్పట్టి ఒంటి చెత్తో ఎన్నో చిరస్మరణియమైన విజయలు అందించాడు. ఈ జనరేషన్ యూత్ ఐకాన్ గా ధోని అభివర్ణించడం అతిశయోక్తి కాదు.
ధోని జీవిత కథ ఆధారంగా ఆయన పేరుతోనే హిందిలో సినిమా చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుట్.. భూమిక చావ్లా, కైరా ఆద్వానీ , దిశా పఠానీ ప్రధాన పాత్రలు పోషించారు. నీరజ్ పాండే దర్శకుడు, ఫాక్స్ స్టార్ స్టూడియో తో కలసి అరుణ్ పాండే నిర్మించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ ను హైదరాబాద్ లో చేశారు. దర్శకుడు రాజమౌళి యం ఎస్ ధోనీ సీడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి 2011 లో వరల్డ్ కప్ నెగ్గిన తరువాత కప్ తను పట్టుకోకుండా.. సహచరులకు ఇచ్చాడు. ఒక కేప్టన్ గా అతినిలో అప్పుడు తనకు కర్మయోగి కనిపించారని రాజమౌళి అన్నారు. ధోనీ జీవిత చరిత్ర గా వస్తున్న ఈ చిత్రం కూడా ఒక సగుటు యువకుడు ఎన్నో ఘన విజయాలు సాధించి కర్మ యోగి గా ఎలా ఎదిగాడు అనే పాయింట్ ను తెలియ చెప్పిదిగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ధోనికూడా రాజమౌళి వంటి డిడికేడెట్ డైరెక్టర్ తో వేదిక పందచుకోవడం ఆనందంగా ఉందన్నారు.