Telugu Global
National

మోదీ రాష్ట్రంలో ద‌ళిత గ‌ర్భిణిపై దాడి!

ఓ వైపు గో సంర‌క్ష‌కుల పేరుతో ద‌ళితుల‌పై దాడులు ఆపాల‌ని ప్ర‌ధాని మోదీ విజ్ఞ‌ప్తి చేస్తున్నా ఆగ‌డం లేదు. అగ్ర‌కుల దుర‌హంకారంతో క‌నిక‌రం లేకుండా గ‌ర్భిణిని చిత‌క‌బాదిన ఘ‌ట‌న సాక్షాత్తూ ఆయ‌న సొంత రాష్ట్రంలోనే చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. గుజ‌రాత్‌లోని బ‌న‌స్కాంత్ జిల్లాలోని క‌ర్జా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నిలేశ్‌భాయ్ దున‌భాయ్ ర‌న్వాసియా అనే ద‌ళితుడి వ‌ద్ద‌కు 10 మంది వ‌చ్చారు. చ‌నిపోయిన ఆవు క‌ళేబ‌రాల‌ను పూడ్చాలంటూ కోరారు. దీనిని నిలేశ్ నిరాక‌రించాడు. […]

మోదీ రాష్ట్రంలో ద‌ళిత గ‌ర్భిణిపై దాడి!
X
ఓ వైపు గో సంర‌క్ష‌కుల పేరుతో ద‌ళితుల‌పై దాడులు ఆపాల‌ని ప్ర‌ధాని మోదీ విజ్ఞ‌ప్తి చేస్తున్నా ఆగ‌డం లేదు. అగ్ర‌కుల దుర‌హంకారంతో క‌నిక‌రం లేకుండా గ‌ర్భిణిని చిత‌క‌బాదిన ఘ‌ట‌న సాక్షాత్తూ ఆయ‌న సొంత రాష్ట్రంలోనే చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. గుజ‌రాత్‌లోని బ‌న‌స్కాంత్ జిల్లాలోని క‌ర్జా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నిలేశ్‌భాయ్ దున‌భాయ్ ర‌న్వాసియా అనే ద‌ళితుడి వ‌ద్ద‌కు 10 మంది వ‌చ్చారు. చ‌నిపోయిన ఆవు క‌ళేబ‌రాల‌ను పూడ్చాలంటూ కోరారు. దీనిని నిలేశ్ నిరాక‌రించాడు. ఈ విష‌యంలో వాగ్వాదం చెల‌రేగడంతో వారంతా నిలేశ్ కుటుంబంపై దాడికి దిగారు. అడ్డొచ్చిన అత‌ని భార్య సంగీత‌ను కూడా చిత‌క‌బాదారు. క‌నీసం గ‌ర్భిణి అన్న క‌నిక‌రం లేకుండా క‌ర్ర‌ల‌తో తీవ్రంగా కొట్టారు. ఆవు క‌ళేబ‌రాల‌ను పాతిపెట్ట‌కుంటే అంద‌రినీ చంపేస్తామ‌ని బెదిరించారు. ఈ దాడిలో నిలేశ్‌, సంగీత దంప‌తులు స‌హా మొత్తం ఆరుగురు గాయ‌ప‌డ్డారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు దాడికి పాల్ప‌డ‌వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ నేప‌థ్యంలో గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.
కొన్నినెల‌లుగా గుజ‌రాత్‌లో ద‌ళితుల‌పై వ‌రుస‌గా దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే వీటిని వ్య‌తిరేకిస్తూ..ప‌లుమార్లు రాష్ట్రవ్యాప్త ఆందోళ‌న‌లు జ‌రిగాయి. అయినా ప‌రిస్థితుల్లో మార్పు లేక‌పో్వ‌డం గ‌మ‌నార్హం. గో సంర‌క్ష‌ణ పేరుతో దాడులు ఆపాల‌ని స్వ‌యంగా ప్ర‌ధాని పిలుపునిచ్చినా… ప‌రిస్థితిలో మార్పు లేక‌పోవ‌డం దురదృష్ట‌క‌రం. ఆవు చ‌ర్మం వ‌లిచార‌ని గుజ‌రాత్‌లోని ఉనా అనే ఊరిలో న‌లుగురు యువ‌కుల‌ను దుస్తులు విప్ప‌దీసి కారుకు క‌ట్టేసి కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ వీడియో అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లానికి కార‌ణ‌మైంది. తాజాగా ఓ గ‌ర్భిణిపై దాడి చేయ‌డం ద‌ళితుల ద‌య‌నీయ ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంద‌ని ప‌లువురు ద‌ళిత నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
First Published:  25 Sept 2016 5:41 AM IST
Next Story