ఇవి "సిజియోఫ్రినియా" వ్యాధి లక్షణాలన్న జయకర్
శనివారం ఏలూరులో జరిగిన దోమలపై దండయాత్ర బహిరంగసభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తాను అందరికంటే తెలివైన వాడినని, కేంద్ర ప్రభుత్వం కంటే తెలివైన వాడినని తనకు తాను ప్రకటించుకోవడంపై జనం రకరకాల అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. తాను కేంద్ర ప్రభుత్వం కంటే తెలివైన వాడినని చంద్రబాబు ప్రకటించడంపై సాక్షి టీవీ చానల్ చానల్ చర్చ కార్యక్రమం నిర్వహించింది. సీఎం తెలివైన వాడైతే ఆ మాట ప్రజలు చెప్పాలి గానీ ముఖ్యమంత్రే మైకు పట్టుకుని […]
శనివారం ఏలూరులో జరిగిన దోమలపై దండయాత్ర బహిరంగసభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తాను అందరికంటే తెలివైన వాడినని, కేంద్ర ప్రభుత్వం కంటే తెలివైన వాడినని తనకు తాను ప్రకటించుకోవడంపై జనం రకరకాల అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. తాను కేంద్ర ప్రభుత్వం కంటే తెలివైన వాడినని చంద్రబాబు ప్రకటించడంపై సాక్షి టీవీ చానల్ చానల్ చర్చ కార్యక్రమం నిర్వహించింది. సీఎం తెలివైన వాడైతే ఆ మాట ప్రజలు చెప్పాలి గానీ ముఖ్యమంత్రే మైకు పట్టుకుని తనకు తాను తెలివైన వాడినని చెప్పుకోవడం ఏమిటని చర్చల్లో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన మాటలపై తానే సమీక్ష జరుపుకోవాలని సూచించారు. ఇదే సమయంలో విసన్నపేట నుంచి జయకర్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా చర్చలో పాల్గొన్నారు. ఒక వ్యక్తి తనకు తాను గొప్పవాడినని ప్రకటించుకోవడం సిజియోఫినియా వ్యాధి లక్షణాల్లో ఒకటి అని జయకర్ చెప్పారు. చంద్రబాబుకు ఆ వ్యాధి ఉందో లేదో తాను చెప్పలేను గానీ అలాంటి లక్షణాలు ఉన్న వారిని సిజియోఫినియాతో బాధపడుతున్న వారిగా భావిస్తారని చెప్పారు. సిజియోఫినియా బారిన పడిన వారు తమకు తాము ఒక ప్రపంచాన్ని ఊహించుకుని అదే నిజమనుకుంటుంటారు. తమ దగ్గర లేనివి కూడా ఉన్నట్టు భావిస్తుంటారని చెబుతుంటారు.
Click on Image to Read: