Telugu Global
Cinema & Entertainment

అప్పుడే డబ్బింగ్ ప్రారంభించాడు...

చిరు 150వ సినిమా సెట్స్ పైకి రావడానికి చాలా టైం తీసుకుంది. కానీ షూటింగ్ ప్రారంభం అయ్యాక ఆ గ్యాప్ ను ఎలా భర్తీ చేయాలో చిరంజీవికి బాగా తెలుసు. అందుకే ఓవైపు షూటింగ్ చేస్తూనే…మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. వరుసపెట్టి షెడ్యూల్స్ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా… సినిమాకు సంబంధించి చిరంజీవి డబ్బింగ్ కూడా ప్రారంభించారు. ఓవైపు షూటింగ్ చేయడం… […]

అప్పుడే డబ్బింగ్ ప్రారంభించాడు...
X

చిరు 150వ సినిమా సెట్స్ పైకి రావడానికి చాలా టైం తీసుకుంది. కానీ షూటింగ్ ప్రారంభం అయ్యాక ఆ గ్యాప్ ను ఎలా భర్తీ చేయాలో చిరంజీవికి బాగా తెలుసు. అందుకే ఓవైపు షూటింగ్ చేస్తూనే…మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. వరుసపెట్టి షెడ్యూల్స్ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా… సినిమాకు సంబంధించి చిరంజీవి డబ్బింగ్ కూడా ప్రారంభించారు. ఓవైపు షూటింగ్ చేయడం… సాయంత్రం డబ్బింగ్ చెప్పడం… ఇలా రెస్ట్ లేకుండా సినిమాను కంప్లీట్ చేస్తున్నారట చిరంజీవి. తారాగణం, లొకేషన్లు, యూనిట్ అంతా సెట్ అయిపోవడంతో.. సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు చిరంజీవి. తాజాగా ఈ సినిమాలోకి శ్రియను కూడా తీసుకోవడంతో… తారాగణం మొత్తం ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. కుదిరితే నవంబర్ చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తిచేయాలని ఖైదీ నంబర్-150యూనిట్ భావిస్తోందట. ఆ తర్వాత సినిమాకు భారీ ప్రచారాన్ని కల్పించి… సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది చిరు ప్లాన్.

First Published:  25 Sept 2016 5:17 PM IST
Next Story