Telugu Global
NEWS

వాటి కోసం అడ్డదారి తెరిచే ఉంచుదాం...

ఏపీలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తేడా వస్తే అధికార పార్టీకి జరిగే నష్టం అంత ఇంతా కాదు. చంద్రబాబు పాలనపై మున్సిపల్ ఎన్నికలు ఒక విధంగా రెఫరెండమే. ఈ నేపథ్యంలో గెలుపు కోసం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తనదైన తరహా ఎత్తులకు శ్రీకారం చుడుతోంది. కిందపడ్డా సరే చివరకు టీడీపీదే పైచేయి కావాలన్నది అధికార పార్టీ గట్టి ఆలోచనగా చెబుతున్నారు. వార్డు సభ్యులు తక్కువగా గెలిచినా సరే […]

వాటి కోసం అడ్డదారి తెరిచే ఉంచుదాం...
X

ఏపీలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తేడా వస్తే అధికార పార్టీకి జరిగే నష్టం అంత ఇంతా కాదు. చంద్రబాబు పాలనపై మున్సిపల్ ఎన్నికలు ఒక విధంగా రెఫరెండమే. ఈ నేపథ్యంలో గెలుపు కోసం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తనదైన తరహా ఎత్తులకు శ్రీకారం చుడుతోంది. కిందపడ్డా సరే చివరకు టీడీపీదే పైచేయి కావాలన్నది అధికార పార్టీ గట్టి ఆలోచనగా చెబుతున్నారు. వార్డు సభ్యులు తక్కువగా గెలిచినా సరే మేయర్, మున్సిపల్ చైర్మన్‌ పదవులు మాత్రం టీడీపీకే దక్కేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందు కోసం మేయర్, చైర్మన్ ఎన్నికలు పరోక్ష పద్దతిలో నిర్వహించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. మేయర్, చైర్మన్ ఎన్నికలు పరోక్ష పద్దతిలో నిర్వహించాలా లేక ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాల అన్నది నిర్ణయించుకునే అధికారం ప్రభుత్వానికి ఉండడంతో దాన్ని ఆసరాగా చేసుకుని పరోక్ష పద్దతి వైపే టీడీపీ మొగ్గుచూపుతోంది. పరోక్ష పద్దతిలో అయితే మేయర్, చైర్మన్‌ అభ్యర్థులకు ప్రజలు నేరుగా ఓటు వేయరు. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు … చైర్మన్లు, మేయర్లను ఎన్నుకుంటారు.

అధికార పార్టీపై ఎలాగూ ప్రజా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి పరోక్ష పద్దతిలో మేయర్, చైర్మన్‌ల ఎన్నిక జరిగితే ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా అదిరించో బెదిరించో, ఆశ చూపో లోబరుచుకునే అవకాశం ఉంటుంది. పైగా మేయర్, చైర్మన్‌ల ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓటు కూడా వాడుకోవచ్చు అన్నది అధికార పార్టీ ఆలోచన. అలా చేయడం వల్ల టీడీపీ కార్పొరేటర్, వార్డు మెంబర్ అభ్యర్థులను ప్రజలు ఓడించినా పరోక్ష పద్దతిలో మేయర్, చైర్మన్‌ స్థానాలను మాత్రం టీడీపీ ఖాతాలో వేసుకోవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇలాంటి ఎత్తులే ప్రయోగించి గతంలో చైర్మన్‌ పీఠాలను దక్కించుకున్న చరిత్ర కూడా టీడీపీకి ఉంది. ఇప్పుడు మరోసారి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈ దొడ్డిదారి అస్త్ర్రాన్నే ప్రయోగించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.

Click on Image to Read:

mla-alla-ramakrishna-reddy

chandrababu-phd

ysrcp-mlas

First Published:  24 Sept 2016 9:09 PM GMT
Next Story