Telugu Global
Cinema & Entertainment

షార్ట్ కట్ లో పని పూర్తిచేసింది...

తక్కువ కాల్షీట్లు ఎక్కువ పారితోషికం పిండుకోవడం ఎలాగో మన హీరోయిన్లకు తెలిసిపోయింది. ఓ వైపు మెయిన్ లీడ్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు ఐటెంసాంగ్స్ లో మెరిస్తే సరిపోతుంది. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఈ ఫార్ములాను ఎప్పటికప్పుడు పాటిస్తుంటుంది మన మిల్కీబ్యూటీ తమన్న. టైం దొరికితే ఐటెంకు రెడీ అయిపోతుంది. ఇప్పటికే పలు ఐటెంసాంగ్స్ లో మెరిసిన తమన్న.. తాజాగా జాగ్వార్ లో కూడా తన స్టయిల్ చూపించింది. హీరో నిఖిల్ కుమార్ తో కలిసి హాట్ […]

షార్ట్ కట్ లో పని పూర్తిచేసింది...
X

తక్కువ కాల్షీట్లు ఎక్కువ పారితోషికం పిండుకోవడం ఎలాగో మన హీరోయిన్లకు తెలిసిపోయింది. ఓ వైపు మెయిన్ లీడ్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు ఐటెంసాంగ్స్ లో మెరిస్తే సరిపోతుంది. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఈ ఫార్ములాను ఎప్పటికప్పుడు పాటిస్తుంటుంది మన మిల్కీబ్యూటీ తమన్న. టైం దొరికితే ఐటెంకు రెడీ అయిపోతుంది. ఇప్పటికే పలు ఐటెంసాంగ్స్ లో మెరిసిన తమన్న.. తాజాగా జాగ్వార్ లో కూడా తన స్టయిల్ చూపించింది. హీరో నిఖిల్ కుమార్ తో కలిసి హాట్ హాట్ గా చిందేసింది. తాజాగా ఈ సినిమా ఐటెంసాంగ్ పిక్చరైజేషన్ పూర్తిచేశారు. ఈ షూటింగ్ తో జాగ్వార్ టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది. 75కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరెక్కకుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈమధ్యే సినిమా ఆడియోను హైదరాబాద్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ మూవీతో ఒకేసారి అటు కన్నడ, ఇటు తెలుగు పరిశ్రమల్లో పాతుకుపోవాలని చూస్తున్నాడు నిఖిల్ కుమార్ గౌడ. అందుకే తమన్నతో ప్రత్యేకంగా ఐటెంసాంగ్ చేయించారు. సినిమా క్లయిమాక్స్ లో వచ్చే ఈ సాంగ్ కచ్చితంగా అందరికీ నచ్చుతుందంటున్నాడు హీరో నిఖిల్.

First Published:  24 Sept 2016 12:53 PM IST
Next Story