ఖైదితో ఆడిపాడనున్న శ్రియా..!
నటన పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న హీరోయిన్స్ లో శ్రియ ఒకరు. నటిగా దాదాపు 15 సంంత్సరాల కెరీర్ ను పూర్తి చేసిన ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పటికి యాక్టింగ్ కు స్వస్తి చెప్పలేదు. సాధారణంగా గ్లామర్ హీరోయిన్ గా కొనసాగుతున్నంత కాలమే హవా వుంటుంది. ఒక్కసారి గ్లామర్ చైర్ నుంచి సైడ్ కు వస్తే దాదాపు కెరీర్ ముగిసినట్లే. కానీ శ్రియా మాత్రం అలా కాదు. తెలుగులో తనకు గ్లామర్ హీరోయిన్ గా అవకాశాలు […]
BY sarvi24 Sept 2016 5:10 AM IST
X
sarvi Updated On: 24 Sept 2016 5:57 AM IST
నటన పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న హీరోయిన్స్ లో శ్రియ ఒకరు. నటిగా దాదాపు 15 సంంత్సరాల కెరీర్ ను పూర్తి చేసిన ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పటికి యాక్టింగ్ కు స్వస్తి చెప్పలేదు. సాధారణంగా గ్లామర్ హీరోయిన్ గా కొనసాగుతున్నంత కాలమే హవా వుంటుంది. ఒక్కసారి గ్లామర్ చైర్ నుంచి సైడ్ కు వస్తే దాదాపు కెరీర్ ముగిసినట్లే.
కానీ శ్రియా మాత్రం అలా కాదు. తెలుగులో తనకు గ్లామర్ హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతే ఇతర భాషల్లో నటించింది. కొన్ని సమాంతర చిత్రాలుచేసింది. మరి కొన్ని వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. ప్రస్తుతం తెలుగులో ఇద్దరు అగ్ర హీరోల చిత్రాల్లో నటిస్తుంది. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో మెయిల్ లీడ్ చేస్తుండగా… చిరంజీవి ఖైది నెంబర్ 150 చిత్రంలో ఒక కీ రోల్ చేస్తుంది. గతంలో మెగాస్టార్ సరసన ఠాగూర్ చిత్రంలో చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Next Story