Telugu Global
NEWS

ఎమ్మెల్యే ఆర్కేను తీవ్రంగా బాధ పెట్టిన సాక్షి పత్రిక ?

ఓటుకు నోటు కేసులో హైకోర్టు స్టేను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందనను తెలుగు పత్రికలు రకరకాలుగా రాశాయి. అయితే సాక్షి పత్రిక కూడా బ్యానర్ ఐటమ్‌గా ఓటుకు నోటు గురించే రాసింది. ఆర్కే పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోజాలమని చెప్పిందని రాసింది. అంతే కాదు ఆర్కే వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్టుగా సుప్రీం చెప్పిందని మొదటిపేజీలోనే సాక్షి రాసింది. ఈ నేపథ్యంలో సాక్షి టీవీలో […]

ఎమ్మెల్యే ఆర్కేను తీవ్రంగా బాధ పెట్టిన సాక్షి పత్రిక ?
X

ఓటుకు నోటు కేసులో హైకోర్టు స్టేను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందనను తెలుగు పత్రికలు రకరకాలుగా రాశాయి. అయితే సాక్షి పత్రిక కూడా బ్యానర్ ఐటమ్‌గా ఓటుకు నోటు గురించే రాసింది. ఆర్కే పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోజాలమని చెప్పిందని రాసింది. అంతే కాదు ఆర్కే వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్టుగా సుప్రీం చెప్పిందని మొదటిపేజీలోనే సాక్షి రాసింది. ఈ నేపథ్యంలో సాక్షి టీవీలో శనివారం ఉదయం జరిగిన కేఎస్‌ఆర్‌ లైవ్‌షోలో ఫోన్‌లైన్‌ ద్వారా మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కే పత్రికల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేయలేదని … కేవలం డిస్పోజ్‌ మాత్రమే చేసిందన్నారు. నాలుగువారాల్లోగా హైకోర్టు తుది నిర్ణయం వెలువరించకపోతే తిరిగి తమను ఆశ్రయించాలని సూచిస్తూ తన పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్పోజ్‌ చేసిందని ఆర్కే చెప్పారు. కానీ కొన్ని పత్రికలు మాత్రం తన పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసిందంటూ రాశాయని… ఇది తనను చాలా బాధించిందని చెప్పారు. డిస్మిస్‌కు డిస్సోజ్‌కు తేడా కూడా తెలియని స్థితిలో మీడియా పెద్దలు ఉన్నారంటే బాధగా ఉందన్నారు. ఆర్కే పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్‌ చేసిందని రాసిన పత్రికల్లో సాక్షి కూడా ఉంది. ఆంధ్రజ్యోతి పత్రిక “ఆర్కే స్పెషల్ లీవ్ పిటిషన్‌ తోసివేత” అని రాసింది. “వైసీపీ ఎమ్మెల్యే పిటిషన్ తిరస్కారం” అని ఆంధ్రభూమి రాసింది.

Click on Image to Read:

chandrababu-phd

ysrcp-mlas

venkaiah-naidu

chandrababu-naidu

First Published:  24 Sept 2016 4:30 PM IST
Next Story