వర్షంపై తప్పుడు పోస్టులు పెడితే కేసులు: బొంతు హెచ్చరిక
నగరంలో కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై జరుగుతున్నప్రచారంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓ వర్గం మీడియా కావాలనే ముంపు తీవ్రతను పెద్దది చేసి చూపెడుతుందని ప్రభుత్వం గ్రహించింది. సోషల్ మీడియాలో, టీవీల్లో పాతవీడియోలను చూపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడేవారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో హైదరాబాదీలను తప్పు దోవ పట్టించేలా కొందరు భయభ్రాంతులకు గురి […]
నగరంలో కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై జరుగుతున్నప్రచారంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓ వర్గం మీడియా కావాలనే ముంపు తీవ్రతను పెద్దది చేసి చూపెడుతుందని ప్రభుత్వం గ్రహించింది. సోషల్ మీడియాలో, టీవీల్లో పాతవీడియోలను చూపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడేవారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో హైదరాబాదీలను తప్పు దోవ పట్టించేలా కొందరు భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టింగులు పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. మేం కూడా వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ‘కానీ, ఇలా జనాలను తప్పుదోవ పట్టించేవారి వల్ల జనాల్లో భయాందోళనలు మరింత పెరుగుతాయి. తప్పుడు ప్రచారం చేసేవారిని వదిలేది లేదు. వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.