కుక్కకు పెట్టినట్లు నేలపై భోజనం పెట్టారు!
జార్ఘండ్ రాష్ట్రంలో ఓ మహిళకు తీవ్ర అవమానం జరిగింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు నేలపై అన్నం పెట్టారు ఆసుపత్రి సిబ్బంది. మానవత్వాన్ని మంటగలిపే ఈ ఘటన రాంచి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చోటు చేసుకుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆకలితో ఉన్న ఓ మహిళ నేలపై వడ్డించిన భోజనాన్ని అలాగే ఆరగించింది. ఈ ఫొటోను జాతీయ పత్రిక దైనిక్ భాస్కర్ ప్రచురించింది. దేశంలోని ఆసుపత్రుల్లో ఉన్న దౌర్భగ్యపు పరిస్థితులకు ఈ ఫొటో […]
BY sarvi23 Sept 2016 6:31 AM IST
X
sarvi Updated On: 23 Sept 2016 1:52 PM IST
జార్ఘండ్ రాష్ట్రంలో ఓ మహిళకు తీవ్ర అవమానం జరిగింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు నేలపై అన్నం పెట్టారు ఆసుపత్రి సిబ్బంది. మానవత్వాన్ని మంటగలిపే ఈ ఘటన రాంచి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చోటు చేసుకుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆకలితో ఉన్న ఓ మహిళ నేలపై వడ్డించిన భోజనాన్ని అలాగే ఆరగించింది. ఈ ఫొటోను జాతీయ పత్రిక దైనిక్ భాస్కర్ ప్రచురించింది. దేశంలోని ఆసుపత్రుల్లో ఉన్న దౌర్భగ్యపు పరిస్థితులకు ఈ ఫొటో అద్దంపట్టింది.
వివరాలు.. పాల్మతీ దేవి అనే మహిళకు చేయి విరగడంతో రాష్ట్రంలోనే అతిపెద్దదైన రాంచి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరింది. ఈ ఆసుపత్రి వార్షిక బడ్జెట్ రూ.300 కోట్లు. పాల్మతీదేవీ బీదరాలు. కనీసం తనకు తినేందుకు పళ్లెం కూడా లేదు. ఆసుపత్రి సిబ్బందిని భోజనం పెట్టేముందు తన ఆరోగ్య పరిస్థితి వివరించి అన్నం తినేందుకు ఒక పళ్లెం కావాలని అడిగింది. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఆమెను కుక్క కంటే హీనంగా చూశారు. పళ్లెం లేదు గిల్లం లేదు. నేలపైనే పెడతాం తింటే తిను లేకుంటే లేదు అని మొహం మీదే చెప్పేశారు. అంతే కాదు వడ్డించే ముందు నేలను శుభ్రం చేసుకోమని చెప్పారు. ఆకలితో కడుపుమాడుతోన్న పాల్మతీదేవి గత్యంతరం లేక నేలను శుభ్రం చేసుకుంది. దానిపై అన్నం వడ్డించారు మానవత్వం మరిచిన ఆ ఆసుపత్రి వంటసిబ్బంది. దిక్కులేక అలా వడ్డించిన అన్నాన్ని పాల్మతీదేవి అలాగే తింది. ఈ దృశ్యాలు దైనిక్ భాస్కర్ విలేకరి కంటబడ్డంతో ఈ ఘోరం వెలుగుచూసింది. దీంతో ఘటనకు కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన చేశాయి.
Click on Image to Read:
Next Story