Telugu Global
NEWS

విద్యావ్యవస్థలో వియ్యంకుల స్వైర విహారం

నారాయణ కాలేజ్. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద విద్యాసంస్థ. టార్చర్ భరించలేక ఈ కాలేజ్‌ విద్యార్థులు పదుల సంఖ్యలో ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నా చర్యలుండవు. కనీసం అలా జరగకుండా జాగ్రత్తలు ఉండవు. నారాయణ వేసే చిల్లర ప్రకటనల కోసం తెలుగు మీడియా కూడా వాటిని ప్రశ్నించదు. దీనికి తోడు ఇప్పుడు నారాయణ మంత్రి కూడా అయ్యారు. ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాస్‌ ఏకంగా ఏపీ విద్యాశాఖ మంత్రి. దీంతో ఇప్పుడు ఈ నారాయణ కాలేజ్‌లు ఆడిందే ఆట పాడిందే పాట. […]

విద్యావ్యవస్థలో వియ్యంకుల స్వైర విహారం
X

నారాయణ కాలేజ్. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద విద్యాసంస్థ. టార్చర్ భరించలేక ఈ కాలేజ్‌ విద్యార్థులు పదుల సంఖ్యలో ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నా చర్యలుండవు. కనీసం అలా జరగకుండా జాగ్రత్తలు ఉండవు. నారాయణ వేసే చిల్లర ప్రకటనల కోసం తెలుగు మీడియా కూడా వాటిని ప్రశ్నించదు. దీనికి తోడు ఇప్పుడు నారాయణ మంత్రి కూడా అయ్యారు. ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాస్‌ ఏకంగా ఏపీ విద్యాశాఖ మంత్రి. దీంతో ఇప్పుడు ఈ నారాయణ కాలేజ్‌లు ఆడిందే ఆట పాడిందే పాట. గతంలో ఏకంగా తెలుగు ఆకాడమీ పుస్తకాలను కాపీ కొట్టిన ట్రాక్ రికార్డు కూడా నారాయణ గారి పేరున ఉంది. ఇంతటి వివాదాస్పద విద్యాసంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది.

ఇంటర్‌ బోర్డు పాలకవర్గంలో కార్పొరేట్ కాలేజీల ప్రతినిధిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అది కూడా నారాయణ విద్యాసంస్థల నుంచే సదరు ప్రతినిధికి చోటు కల్పించారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ జీవో 107ను జారీ చేశారు. అంటే ఇకపై ఇంటర్ బోర్డు పాలకవర్గంలో నారాయణ విద్యాసంస్థలు సూచించిన విధానాలే అమలవుతాయన్న మాట. విద్యాసంస్థల అధినేత ఒక మంత్రి. విద్యాసంస్థల అధినేత వియ్యంకుడు ఏకంగా విద్యాశాఖ మంత్రి. ఇలాంటి సమయంలో తమ విద్యాసంస్థల నుంచే ప్రతినిధిని బోర్డులో పెడితే విమర్శలు వస్తాయన్న భయం కూడా ప్రభుత్వ పెద్దలకు లేకుండాపోయింది. ఇలా వియ్యంకులు ఇద్దరూ కలిసి విద్యావ్యవస్థతో ఆటలాడుతుండడంతో పెద్దెత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విద్యను ఖరీధైన వస్తువుగా మార్చిన నారాయణ… పేద కుటుంబాలు తమ పిల్లలను చదివించుకోవడం కోసం ఆస్తులు అమ్ముకునే దుస్థితి తెచ్చారని… ఇప్పుడు బోర్డులో చేరి ఏకంగా ప్రభుత్వవిద్యకే ఉరితాడువేయిస్తాడేమోనని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు కూడా తాము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని పెద్దల ఆదేశాలను అమలు చేయడం మినహా తమకు మరోదారి లేదంటున్నారు.

Click on Image to Read:

mlc-satish-reddy

deccan-chronicle-chief-krishna-rao

ys-jagan1

First Published:  22 Sept 2016 11:32 PM GMT
Next Story