నాకు రెండు పాన్ కార్డులున్నాయి.. తెలంగాణ అధికారులే దొంగల్లా..
తప్పు చేసిన వారు తనను తాను సమర్థించుకోవడానికి ఏమైనా చెబుతారు.. వినేవాడు ఉండాలే ఎన్ని హరికథలైనా వినిపిస్తారు. ప్రస్తుతం భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఇదే బాటలో నడస్తున్నారు. తనకు రెండు పాన్ కార్డులున్న విషయం నిజమేనని అంగీకరించారు. తరువాత అధికారులే మార్చి ఇచ్చారన్నారు. అస్సలు రెండు పాన్ కార్డులు ఉండటం తప్పేకాదన్నట్లుగా మాట్లాడారు. అయితే, డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన అధికారికి రెండు పాన్ కార్డులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం […]
BY sarvi23 Sept 2016 5:02 AM IST
X
sarvi Updated On: 23 Sept 2016 5:39 AM IST
తప్పు చేసిన వారు తనను తాను సమర్థించుకోవడానికి ఏమైనా చెబుతారు.. వినేవాడు ఉండాలే ఎన్ని హరికథలైనా వినిపిస్తారు. ప్రస్తుతం భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఇదే బాటలో నడస్తున్నారు. తనకు రెండు పాన్ కార్డులున్న విషయం నిజమేనని అంగీకరించారు. తరువాత అధికారులే మార్చి ఇచ్చారన్నారు. అస్సలు రెండు పాన్ కార్డులు ఉండటం తప్పేకాదన్నట్లుగా మాట్లాడారు. అయితే, డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన అధికారికి రెండు పాన్ కార్డులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం వివరణ ఇవ్వలేకపోయారు. తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదని పాత పాటే పాడారు. పైగా తెలంగాణ అధికారులే తన భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని కొత్తవాదన తెరపైకి తీసుకువచ్చారు. వివాదం కోర్టులో ఉండగా తన భూమిలోకి అర్ధరాత్రిపూట దొంగల్లా ఎలా వస్తారని ఎదురు ప్రశ్నించారు. గీత వాదన విన్న అధికారులు విస్మయం చెందుతున్నారు. ఎవరూ విక్రయించకుండానే భూమిపై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన గీత వ్యవహారం దొంగే దొంగా.. దొంగా.. అని అరిచిన చందంగా వ్యాఖ్యానిస్తున్నారు.
కొత్తపల్లి గీత ఎంపీగా గెలిచినప్పటి నుంచి అనేక వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు. వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత వెంటనే టీడీపీలోకి జంప్ అయ్యారు. నకిలీ డాక్యుమెంట్లతో ఎన్నికలకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.కోట్ల డబ్బు రుణంగా తీసుకున్న కేసు వెలుగు చూసింది. అస్సలు ఆమె ఎవరి నుంచి భూమి కొన్నదన్నదే వివాదాస్పదంగా మారింది. అసలు ఆ భూమిని గీతకు ఎవరూ విక్రయించలేదని, నకిలీ పత్రాలతో ఆమెనే తన భర్త పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేయించారన్నవిషయం సీబీఐ దర్యాప్తులో తేలింది. అయినా ఇంకా.. ఇలాంటి బుకాయింపు మాటలు మాట్లాడటం గీతకే చెల్లిందంటున్నారు తెలంగాణ అధికారులు. సీబీఐ కేసు నుంచి తప్పించుకోవడానికే ఆమె టీడీపీలోకి చేరారన్న వార్తలకు జరుగుతున్న ఘటనలన్నీ బలం చేకూరుస్తున్నాయి. పాపం! కొంతకాలంపాటు గీతను టీడీపీ ఎంపీగా రాసిన టీడీపీ అనుకూల పత్రికలు సీబీఐ కేసు నమోదు చేయగానే.. వైఎస్సార్ సీపీ ఎంపీగానే రాస్తున్నాయి. టీడీపీకి సంబంధం లేని వ్యక్తిగా రాస్తుండటం గమనిస్తుంటే.. రేపు ఈ ఆరోపణలు రుజువైతే.. . గీతతో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు వీటినే ఆధారంగా చూపినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Click on Image to Read:
Next Story