Telugu Global
NEWS

దత్తాత్రేయకు వెంక‌య్య‌కు పోలికా?

బ‌ట్ట‌త‌ల‌కు.. బోడిగుండుకు ముడిపెట్ట‌డంలో టీడీపీ అనుకూల ప‌త్రిక ఆరితేరిపోయింది. నిత్యం టీడీపీ, చంద్ర‌బాబు, అత‌ని సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌ను ఆధునిక గాంధీలంటూ డ‌బ్బా కొట్టే ఆ ప‌త్రిక తాజాగా ఈసారి ఇందుకోసం కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ‌ను వాడేసుకుంది. ప్ర‌పంచంలో ఎవ‌రు ఏది క‌నిపెట్టినా.. ఆ గొప్ప త‌న‌దేన‌ని చెప్పుకునేత‌త్వం చంద్ర‌బాబుది అయితే.. దేశంలో ఎవ‌రు ఏమంచి ప‌ని త‌ల‌పెట్టినా.. ఆ క్ర‌తువులో చంద్ర‌బాబు అనుంగుల‌ను చేర్చేప‌ని ఈ పత్రికది.  ఇంత‌కీ విష‌య‌మేంటంటే.. అపెక్స్ క‌మిటీ స‌మావేశం కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ […]

దత్తాత్రేయకు వెంక‌య్య‌కు పోలికా?
X
బ‌ట్ట‌త‌ల‌కు.. బోడిగుండుకు ముడిపెట్ట‌డంలో టీడీపీ అనుకూల ప‌త్రిక ఆరితేరిపోయింది. నిత్యం టీడీపీ, చంద్ర‌బాబు, అత‌ని సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌ను ఆధునిక గాంధీలంటూ డ‌బ్బా కొట్టే ఆ ప‌త్రిక తాజాగా ఈసారి ఇందుకోసం కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ‌ను వాడేసుకుంది. ప్ర‌పంచంలో ఎవ‌రు ఏది క‌నిపెట్టినా.. ఆ గొప్ప త‌న‌దేన‌ని చెప్పుకునేత‌త్వం చంద్ర‌బాబుది అయితే.. దేశంలో ఎవ‌రు ఏమంచి ప‌ని త‌ల‌పెట్టినా.. ఆ క్ర‌తువులో చంద్ర‌బాబు అనుంగుల‌ను చేర్చేప‌ని ఈ పత్రికది.
ఇంత‌కీ విష‌య‌మేంటంటే.. అపెక్స్ క‌మిటీ స‌మావేశం కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ త‌న ప‌నిలో స‌ఫ‌లీకృత‌మ‌య్యాడు. స‌మావేశంలో చంద్ర‌బాబును ఎర్రిప‌ప్ప‌ను చేశాడ‌ని చెప్పుకుంటున్నారు. ఈ విష‌యాన్ని క‌వ‌ర్ చేయ‌డానికి భ‌లే తంటాలు ప‌డుతోంది సదరు పత్రిక. కేసీఆర్ నిన్న కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ ఇంటికి వెళ్లాడు. మ‌న రాష్ర్టానికి పెద్ద‌దిక్కు అయిన దత్తాత్రేయతో స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని కేసీఆర్ సూచించాడ‌ని ఓ భారీ క‌థ‌నం రాసింది. చివ‌ర‌లో కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌ను ఇరికించింది. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు ఏపీ రాష్ర్టాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడ‌ట‌. ద‌త్తాత్రేయ కూడా ఆయన బాట‌లోన‌డ‌వాల‌ని కేసీఆర్ మ‌న‌సులో కోరుకున్నాడ‌ని ఓ సొంత విశ్లేష‌ణ‌ను అతికించింది.
అయితే, ఈ పోలిక‌పై తెలంగాణ‌లోని బీజేపీ నేత‌లు, టీఆర్ ఎస్ నాయ‌కులు మండిప‌డుతున్నారు. టీడీపీ కోసం పార్ల‌మెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకున్న‌ వెంక‌య్య‌కు, తెలంగాణ‌లో బీజేపీ కోసం నిజాయ‌తీగా ప‌నిచేసే ద‌త్తాత్రేయ‌కు పోలికేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ద‌త్తాత్రేయ మిత‌భాషి ఎవ‌రు చెప్పినా.. చెప్ప‌కున్నా త‌న ప‌నుల‌ను తాను మౌనంగా చేసుకుంటూ వెళ్తారు. అలాంటి ద‌త్తాత్రేయకు బీజేపీలో ఉంటూ టీడీపీ, చంద్ర‌బాబును బహిరంగ వేదిక‌ల‌పై పొగిడే వెంక‌య్య కు ఎలా లింకు పెడ‌తారంటూ మండిప‌డుతున్నారు. ప్ర‌త్యేక హోదా అంటూ ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన వెంక‌య్య ప్ర‌జాప్ర‌తినిధా? అంటూ నిల‌దీస్తున్నారు. ప్ర‌జాక్షేత్రంలో పోరాడి గెల‌వ‌ని వాడు ప్ర‌జ‌ల క్షేమం ఎలా పనిచేస్తాడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Click on Image to Read:

mlc-satish-reddy

deccan-chronicle-chief-krishna-rao

ys-jagan1

First Published:  23 Sept 2016 5:42 AM IST
Next Story