Telugu Global
Cinema & Entertainment

డైలమాలో పడిన సునీల్...

ఈమధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. పైగా రెండు-మూడు ఫ్లాపులు కూడా పడ్డాయి. తాజాగా వచ్చిన సినిమా కూడా ఫెయిల్ అయింది. దీంతో తన కొత్త సినిమాపై డైలమాలో పడ్డాడు హీరో సునీల్. నిజానికి సినిమాపై సునీల్ కు మంచి నమ్మకం ఉన్నప్పటికీ… భారీ కాంపిటిషన్ మధ్యలో తన సినిమాను విడుదలచేసి, మళ్లీ బుక్కవ్వడం ఎఁదుకునే అనుమానం మాత్రం ఈ హీరోను వెంటాడుతోంది. అందుకే “ఈడు గోల్డ్ ఎహే” సినిమాపై డైలమాలో పడిపోయాడు సునీల్. దసరా కానుకగా […]

డైలమాలో పడిన సునీల్...
X
ఈమధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. పైగా రెండు-మూడు ఫ్లాపులు కూడా పడ్డాయి. తాజాగా వచ్చిన సినిమా కూడా ఫెయిల్ అయింది. దీంతో తన కొత్త సినిమాపై డైలమాలో పడ్డాడు హీరో సునీల్. నిజానికి సినిమాపై సునీల్ కు మంచి నమ్మకం ఉన్నప్పటికీ… భారీ కాంపిటిషన్ మధ్యలో తన సినిమాను విడుదలచేసి, మళ్లీ బుక్కవ్వడం ఎఁదుకునే అనుమానం మాత్రం ఈ హీరోను వెంటాడుతోంది. అందుకే “ఈడు గోల్డ్ ఎహే” సినిమాపై డైలమాలో పడిపోయాడు సునీల్. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఓవైపు గ్రాండ్ గా ఎనౌన్స్ చేస్తున్నప్పటికీ.. పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. అదే రోజున నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమా విడుదలకానుండగా… అంతకంటే వారం ముందు రామ్ హీరోగా నటించిన హైపర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ రెండు సినిమాలు కాకుండా… నేనొస్తా అంటూ ఇజంతో కల్యాణ్ రామ్ భయపెడుతూనే ఉన్నాడు. సో.. . ఇంతపోటీ మధ్య ఈడు గోల్డ్ ఎహే సినిమాను విడుదల చేయడం అవసరమా అనే ఆలోచనలో ఉన్నాడు సునీల్. కానీ మరోవైపు ప్రమోషన్ మాత్రం జోరుగా సాగుతోంది. మరి సునీల్ తగ్గుతాడా… బరిలోకి దిగుతాడా అనేది మరో వారం రోజుల్లో తేలిపోతుంది.
First Published:  22 Sept 2016 6:31 AM IST
Next Story