మరో ఇబ్బందిలో సౌందర్య, ఫ్లెక్సీల దహనం
భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి ఇటీవల వార్తల్లోకి ఎక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్యకు మరో చిక్కు వచ్చి పడింది. ఏకంగా తమిళనాడులో ఆమె ప్లెక్సీలను, చిత్రపటాలను దగ్దం చేసేందుకు కొందరు వెనుకాడలేదు. అయితే ఇందులో సౌందర్య చేసిన తప్పేమీ లేదు. ఆమెను ఇండియా యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు అంబాసిడర్గా నియమించడంపైనే కొందరు ఆందోళనకు దిగారు. ఇండియా యానిమల్ వెల్ఫేర్ బోర్డు పోరాటం కారణంగానే తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం విధించారు. జల్లికట్టు నిషేధానికి కారణమై తమిళుల మనోభావాలను దెబ్బతీసిన […]
భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి ఇటీవల వార్తల్లోకి ఎక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్యకు మరో చిక్కు వచ్చి పడింది. ఏకంగా తమిళనాడులో ఆమె ప్లెక్సీలను, చిత్రపటాలను దగ్దం చేసేందుకు కొందరు వెనుకాడలేదు. అయితే ఇందులో సౌందర్య చేసిన తప్పేమీ లేదు. ఆమెను ఇండియా యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు అంబాసిడర్గా నియమించడంపైనే కొందరు ఆందోళనకు దిగారు. ఇండియా యానిమల్ వెల్ఫేర్ బోర్డు పోరాటం కారణంగానే తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం విధించారు. జల్లికట్టు నిషేధానికి కారణమై తమిళుల మనోభావాలను దెబ్బతీసిన సంస్థకు రజనీ కూతురు అంబాసిడర్గా ఉండకూడదన్నది ఆందోళన కారుల డిమాండ్. వెంటనే సౌందర్య ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరవిళైయాట్టు మీట్పు కళగం సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు తమిళనాడులో కొనసాగుతున్నాయి.