సిరిసిల్ల సెగలు ఆగేలా లేవు!
సిరిసిల్లను జిల్లా చేస్తామంటూ ప్రభుత్వం ఏనాడు ప్రకటించిందో తెలియదు కానీ.. అది చివరికి కేటీఆర్ మెడకే చుట్టుకుంటుందని ఎవరూ ఊహించలేదు. సిరిసిల్లను జిల్లా చేసేంతవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని సిరిసిల్ల జిల్లాసాధన సమితి స్పష్టం చేసింది. ఈ మేరకు ఇచ్చిన 48 గంటల బంద్ ప్రశాంతంగా, పరిపూర్ణంగా జరగడం ప్రజల డిమాండ్‌కు అద్దం పట్టింది. సిరిసిల్ల జిల్లా విషయం స్థానిక టీఆర్ ఎస్‌కు- జేఏసీల మధ్య తీవ్ర అగాథాన్ని పెంచింది. ఆదివారం కేసీఆర్, కేటీఆర్ ప్లెక్సీల దహనం […]
BY sarvi21 Sept 2016 10:26 PM GMT
X
sarvi Updated On: 21 Sept 2016 11:51 PM GMT
సిరిసిల్లను జిల్లా చేస్తామంటూ ప్రభుత్వం ఏనాడు ప్రకటించిందో తెలియదు కానీ.. అది చివరికి కేటీఆర్ మెడకే చుట్టుకుంటుందని ఎవరూ ఊహించలేదు. సిరిసిల్లను జిల్లా చేసేంతవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని సిరిసిల్ల జిల్లాసాధన సమితి స్పష్టం చేసింది. ఈ మేరకు ఇచ్చిన 48 గంటల బంద్ ప్రశాంతంగా, పరిపూర్ణంగా జరగడం ప్రజల డిమాండ్‌కు అద్దం పట్టింది. సిరిసిల్ల జిల్లా విషయం స్థానిక టీఆర్ ఎస్‌కు- జేఏసీల మధ్య తీవ్ర అగాథాన్ని పెంచింది. ఆదివారం కేసీఆర్, కేటీఆర్ ప్లెక్సీల దహనం చేస్తున్న సమయంలో స్థానిక గులాబీ నేతలు అడ్డుకున్నారు. దీంతో మాటామటా పెరిగి ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు. తాజాగా 48 గంటల బంద్ పిలుపులో భాగంగా టీఆర్ ఎస్ గద్దెలను ఎక్కడికక్కడ కూల్చి తమ నిరసన తెలియజేశారు జేఏసీ నాయకులు. జోరు వర్షంలోనూ ఆందోళనలు కొనసాగించడం గమనార్హం.
కేటీఆర్‌కు సిరిసిల్ల నియోజకవర్గం కంచుకోట. మూడుసార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని విజయం సాధించారు. పైగా సీఎం కేసీఆర్ కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం కావడంతో ప్రజలు అభివృద్ధిపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇదే క్రమంలో సిరిసిల్లను జిల్లాను చేయనున్నామని ప్రకటన రావడంతో ఇక్కడివారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సిరిసిల్లను జిల్లాను చేసినా ఆర్థికంగా మనుగడ సాధించే వనరులు , భౌగోళిక విస్తీర్ణం, జనాభా పరంగా ఇలా ఏరకంగా చూసినా సిరిసిల్ల జిల్లాగా మనుగడ సాధించే అంశాలేవీ కనిపించలేదు. దీంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. కానీ, దీన్ని ప్రజలు అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా సిరిసిల్లలోని వ్యాపారులు, చేనేత కార్మికులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాకవన్నీ అనవసరం మా సిరిసిల్లను జిల్లాగా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు, రైల్వే మార్గం ఇలా పలు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రతిపాదించారు. బహిరంగంగా క్షమాపణలు కూడా జెప్పారు అయినా సరే సిరిసిల్లవాసులు ససేమీరా అంటున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కేటీఆర్ తల పట్టుకున్నారు.
Next Story