Telugu Global
International

భారత్‌పై ముషార్రఫ్ తీవ్ర వ్యాఖ్యలు

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు.భారత్‌ పాకిస్తాన్‌పై దాడి చేస్తే తిరిగి దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. భారత్‌లో ఎక్కడ దాడులు జరిగినా దాన్ని పాక్‌కు ఆపాదించడం భారత్‌కు అలవాటుగా మారిందన్నారు. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న ముషార్రఫ్ యూరీ దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటున్న భారత్‌ డిఫెన్స్ మినిస్ట్రీ.. ఒక్కసారి అనంతరం జరిగే పరిణామాలను కూడా అర్థం చేసుకోవాలన్నారు. భారత్‌ ఇప్పుడు తనకు నచ్చిన చోటును ఎంచుకుని నచ్చిన సమయంలో దాడి చేస్తే… […]

భారత్‌పై ముషార్రఫ్ తీవ్ర వ్యాఖ్యలు
X

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు.భారత్‌ పాకిస్తాన్‌పై దాడి చేస్తే తిరిగి దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. భారత్‌లో ఎక్కడ దాడులు జరిగినా దాన్ని పాక్‌కు ఆపాదించడం భారత్‌కు అలవాటుగా మారిందన్నారు. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న ముషార్రఫ్ యూరీ దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటున్న భారత్‌ డిఫెన్స్ మినిస్ట్రీ.. ఒక్కసారి అనంతరం జరిగే పరిణామాలను కూడా అర్థం చేసుకోవాలన్నారు.

భారత్‌ ఇప్పుడు తనకు నచ్చిన చోటును ఎంచుకుని నచ్చిన సమయంలో దాడి చేస్తే… పాకిస్థాన్‌ కూడా నచ్చిన సమయంలో నచ్చిన చోట భారత్‌పై దాడి చేస్తుందని హెచ్చరించారు. పాక్ ఆర్మీ సాయంతోనే యూరీలో దాడి జరిగిందన్నది అవాస్తమని చెప్పుకొచ్చారు. దాడి అనంతరం లభ్యమైన ఆయుధాలు, పేలుడు సామాగ్రి మొత్తం పాకిస్తాన్ నుంచే వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి కదా అని మీడియా ప్రశ్నించగా ప్రపంచంలోని ఏ ప్రాంతంనుంచైనా ఎవరైనా ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. ఆయుధాలు అక్కడివే అయినా.. ఆ దాడికి పాల్పడినవారు పాక్ నుంచే వచ్చారనడానికి ఆధారాలు లేవు కదా అంటూ ఎదురు ప్రశ్నించారు.

మరోవైపు పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి మద్దతు తెలిపే దేశంగా గుర్తించాలంటూ అమెరికా సభలో ఇద్దరు సభ్యులు ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికాకు మిత్ర దేశంగా ఉంటూ శత్రు దేశాలకు పాకిస్థాన్‌ సహాయం చేస్తోందని సదరు సభ్యులు ఆరోపించారు. బిన్ లాడెన్ వంటి ప్రమాదకార టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం ఉగ్రవాదానికి పాకిస్థాన్ కొమ్ముకాస్తోందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతిస్తోందా లేదా అన్నదానిపై అధ్యక్షుడు ఒబామా పాలక వర్గం 90 రోజుల్లో సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

First Published:  21 Sept 2016 6:33 PM IST
Next Story