Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కోసం బ్యాంకాక్ చెక్కేశాడు...?

టైం దొరికితే బ్యాంకాంక్ చెక్కేయడం పూరి జగన్నాధ్ కు హాబీ. సినిమా షూటింగ్ అంటే బ్యాంకాక్… రిలాక్స్ అవ్వాలంటే బ్యాంకాక్… కొత్త కథ రాసుకోవాలంటే బ్యాంకాక్…. ఆ కథకు లొకేషన్లు వెదకాలంటే బ్యాంకాక్… ఇలా బ్యాంకాక్ ను పూరి జగన్నాధ్ ను వేరుచేసి చూడలేం. ఈ దర్శకుడు ఇప్పుడు మరోసారి బ్యాంకాక్ వెళ్లాడు. ఈసారి పూరి… అక్కడికి వెళ్లింది కేవలం ఎన్టీఆర్ కోసమేనట.  జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పటివరకు ఎవరికీ ఓకే చెప్పలేదు తారక్. వక్కంతం వంశీతో […]

ఎన్టీఆర్ కోసం బ్యాంకాక్ చెక్కేశాడు...?
X
టైం దొరికితే బ్యాంకాంక్ చెక్కేయడం పూరి జగన్నాధ్ కు హాబీ. సినిమా షూటింగ్ అంటే బ్యాంకాక్… రిలాక్స్ అవ్వాలంటే బ్యాంకాక్… కొత్త కథ రాసుకోవాలంటే బ్యాంకాక్…. ఆ కథకు లొకేషన్లు వెదకాలంటే బ్యాంకాక్… ఇలా బ్యాంకాక్ ను పూరి జగన్నాధ్ ను వేరుచేసి చూడలేం. ఈ దర్శకుడు ఇప్పుడు మరోసారి బ్యాంకాక్ వెళ్లాడు. ఈసారి పూరి… అక్కడికి వెళ్లింది కేవలం ఎన్టీఆర్ కోసమేనట.
జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పటివరకు ఎవరికీ ఓకే చెప్పలేదు తారక్. వక్కంతం వంశీతో పాటు పూరి జగన్నాధ్ కూడా స్టోరీ వినిపించాడు. ఆ స్టోరీలైన్ నచ్చిన తారక్… పక్కా స్క్రీన్ ప్లే రాసుకొని రమ్మన్నాడట. అందుకే పూరి… బ్యాంకాక్ వెళ్లాడు. ఓ 3 రోజుల పాటు బ్యాంకాక్ లోనే ఉండి.. స్క్రీన్ ప్లే రాసుకొచ్చి ఎన్టీఆర్ కు వినిపిస్తాడట. ఆ స్క్రీన్ ప్లేను కూడా విన్న తర్వాత.. దసరా టైమ్ కు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయాలని తారక్ భావిస్తున్నాడు.
Click on Image to Read:
alluarjun
First Published:  22 Sept 2016 5:36 AM
Next Story