కథ కూడా వినకుండా సినిమా చేసిన చైతన్య
కొంతమందిపై ఓ నమ్మకం అలా ఉండిపోతుంది. నిర్మాత చినబాబుపై నాగచైతన్యకు కూడా అంతే నమ్మకం. అందుకే ప్రేమమ్ సినిమా కథ కూడా వినకుండా సినిమా చేశాడు చైతూ. ఆ విషయాన్ని ఆడియో ఫంక్షన్ లో నాగచైతన్య స్వయంగా వెల్లడించాడు. సినిమా గొప్పగా వచ్చిందని.. కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నాడు. నాగ చైతన్య మాట్లాడుతూ…సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సపోర్ట్ చేసేది మా అభిమానులే. తాత గారు జర్నీ స్టార్ట్ చేసారు. నాన్నగారు ఆ జర్నీని […]
BY sarvi21 Sept 2016 6:51 PM IST
X
sarvi Updated On: 21 Sept 2016 6:51 PM IST
కొంతమందిపై ఓ నమ్మకం అలా ఉండిపోతుంది. నిర్మాత చినబాబుపై నాగచైతన్యకు కూడా అంతే నమ్మకం. అందుకే ప్రేమమ్ సినిమా కథ కూడా వినకుండా సినిమా చేశాడు చైతూ. ఆ విషయాన్ని ఆడియో ఫంక్షన్ లో నాగచైతన్య స్వయంగా వెల్లడించాడు. సినిమా గొప్పగా వచ్చిందని.. కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నాడు.
నాగ చైతన్య మాట్లాడుతూ…సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సపోర్ట్ చేసేది మా అభిమానులే. తాత గారు జర్నీ స్టార్ట్ చేసారు. నాన్నగారు ఆ జర్నీని కంటిన్యూ చేసారు. మీ సపోర్ట్ తో నేను నాన్న గారి జర్నీని కంటిన్యూ చేస్తున్నాను. ప్రేమమ్ సినిమా బాగా ప్రేమించి చేసిన సినిమా. తెలుగు ఆడియోన్స్ కి నచ్చేలా తీద్దాం అని ఈ సినిమా చేసాం. ఈ సినిమా చేసేటప్పుడు అక్కడ ఉన్న ప్రతి టెక్నిషియన్స్ ని అప్రిషియేట్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా టెక్నీషియన్స్ ను అక్కడ ఉన్న టెక్నీషియన్స్ అప్రిషియేట్ చేస్తారు. మా డైరెక్టర్ చందు, నిర్మాత వంశీకి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. నాకు కథ నచ్చింది చేస్తావా అని చినబాబు గారు అడిగితే కథ వినకుండా సినిమా చేశాను. అక్టోబర్ 7 ప్రేమమ్ వస్తుంది. మనం అందరం గర్వంగా ఫీలయ్యే సినిమా అవుతుంది అన్నారు.
Next Story