అవి మంచినీళ్లు కావు... 50 మందిపై రైల్వే శాఖ ఫైన్...
స్వచ్ఛభారత్… స్వచ్ఛ రైల్వే కార్యక్రమం కింద సౌత్ సెంట్రల్ రైల్వే సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా రైల్వే అధికారులు దక్షిణమధ్య రైల్వేకి చెందిన 153 స్టేషన్‌లలో తనిఖీ చేయగా వివిధ బ్రాండ్ల వాటర్ బాటిల్స్‌లోని నీళ్లను పరీక్షించగా సురక్షితమైనవి కాదని తేలింది. వాటిని అమ్ముతున్న 50మంది వెండర్లపై ఫైన్ విధించారు. ఒక్కరోజుపాటు వివిధ స్టేషన్లలో, రైళ్లల్లో తనిఖీచేస్తేనే ఇన్నిరకాల తాగడానికి సురక్షితంకాని మంచినీటి బాటిల్స్ దొరికితే ఇక రోజూ రైడ్ చేస్తే […]
స్వచ్ఛభారత్… స్వచ్ఛ రైల్వే కార్యక్రమం కింద సౌత్ సెంట్రల్ రైల్వే సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా రైల్వే అధికారులు దక్షిణమధ్య రైల్వేకి చెందిన 153 స్టేషన్‌లలో తనిఖీ చేయగా వివిధ బ్రాండ్ల వాటర్ బాటిల్స్‌లోని నీళ్లను పరీక్షించగా సురక్షితమైనవి కాదని తేలింది. వాటిని అమ్ముతున్న 50మంది వెండర్లపై ఫైన్ విధించారు. ఒక్కరోజుపాటు వివిధ స్టేషన్లలో, రైళ్లల్లో తనిఖీచేస్తేనే ఇన్నిరకాల తాగడానికి సురక్షితంకాని మంచినీటి బాటిల్స్ దొరికితే ఇక రోజూ రైడ్ చేస్తే ఎంతపెద్ద మొత్తంలో దొరుకుతాయో..! ఇక వాటర్ ప్యాకెట్స్ అయితే మరీ నాసిరకంగా ఉన్నాయని తేలింది.
స్టేషన్ పంపుల్లో వచ్చే నీరు సురక్షితం కాదని పెద్దమొత్తంలో డబ్బులు పెట్టి వాటర్ బాటిల్స్ కొంటుంటే అవీ నాసిరకం అయితే ఇక ప్రయాణికుల ఆరోగ్యానికి ఎవరు దిక్కు? అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. స్టేషన్లలో కాదని బయటకొందామన్నా ఇవే బ్రాండ్స్. ఇదే క్వాలిటీ. మంచి నీళ్ల వ్యాపారంమీద ప్రభుత్వాలకు ఎలాగూ అదుపులేదు. కాబట్టి కనీసం రైల్వే శాఖ అయినా ప్రయాణికులకోసం సురక్షితమైన తాగునీటిని అందించే ఏర్పాటుచేస్తే మంచిది.
Click on Image to Read: