Telugu Global
NEWS

అప్పటి వీడియోను చూపించిన కేసీఆర్‌.... అదిరిపడ్డ బాబు....

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన అఫెక్స్ భేటీ వాడీవేడిగా సాగింది. పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కొత్తగా నిర్మిస్తున్నారని చంద్రబాబు వాదించారు. అయితే హఠాత్తుగా టీ సీఎం కేసీఆర్‌ చూపించిన వీడియో దెబ్బకు చంద్రబాబు నోట మాటరాలేదు. కేసీఆర్ చూపించిన వీడియో తర్వాత చంద్రబాబు ఏపీ ప్రయోజనాలపై వాదించే విషయంలో దాదాపు […]

అప్పటి వీడియోను చూపించిన కేసీఆర్‌.... అదిరిపడ్డ బాబు....
X

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన అఫెక్స్ భేటీ వాడీవేడిగా సాగింది. పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కొత్తగా నిర్మిస్తున్నారని చంద్రబాబు వాదించారు. అయితే హఠాత్తుగా టీ సీఎం కేసీఆర్‌ చూపించిన వీడియో దెబ్బకు చంద్రబాబు నోట మాటరాలేదు. కేసీఆర్ చూపించిన వీడియో తర్వాత చంద్రబాబు ఏపీ ప్రయోజనాలపై వాదించే విషయంలో దాదాపు చేతులెత్తేశారు. రెండు ప్రాజెక్టులు ఎలా కడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించగా… ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్ వచ్చిన మోదీ పాలమూరు ప్రాజెక్టుపై చేసిన ప్రసంగం వీడియోను కేసీఆర్ అఫెక్స్ కమిటీ భేటీలో ప్రదర్శించారు. దీంతో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి కూడా మౌనంగా ఉండిపోయారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే మోదీని ధిక్కరించినట్టు అవుతుందని ఆమె ఏమీ మాట్లాడలేదు.

అప్పటి వరకు టీ ప్రాజెక్టులు అక్రమమని చెప్పిన చంద్రబాబు కూడా మోదీ వీడియో చూసిన తర్వాత మొత్తబడ్డారు. మోదీయే ప్రాజెక్టులు పాతవని నిర్ధారించిన తర్వాత ఇక లాభం లేదనుకున్నారో ఏమో గానీ చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. దీంతో అఫెక్స్ కమిటీలో పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు దాదాపు మద్దతు లభించింది. కేసీఆర్‌ హఠాత్తుగా మోదీ వీడియోను ప్రదర్శించడం దానిపై చంద్రబాబు గట్టిగా మాట్లాడకపోవడంతో ఏపీ వాదన బలహీనపడిపోయింది. అయినా మోదీ పాలమూరు ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడినంత మాత్రాన చంద్రబాబు ఎందుకు మెత్తబడ్డారో!. దానికి ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోయారో!. ఇప్పుడు ఈ విషయంలోనూ చంద్రబాబు విమర్శలు ఎదుర్కోక తప్పదనిపిస్తోంది. ఓటుకు నోటు కేసుకు భయపడే మోదీ మాటలను ఎదిరించలేక చంద్రబాబు సైలెంట్‌గా అఫెక్స్ కమిటీ భేటీలో చేతులు ఎత్తేశారన్న విమర్శలు రావచ్చు.

Click on Image to Read:

ias-katamaneni-bhaskara-rao

amaravathi-formers

revanth-reddy

First Published:  22 Sept 2016 7:27 AM IST
Next Story