Telugu Global
NEWS

మేమూ వెళ్తాం….

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించడాన్ని వైసీపీ స్వాగతించింది. ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును చూసైనా ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ నైతికతతో వ్యవహరించాలని అంబటిరాంబాబు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తిస్తుందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ చేసిన పనినే ఏపీలో చంద్రబాబు కూడా చేశారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు […]

మేమూ వెళ్తాం….
X

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించడాన్ని వైసీపీ స్వాగతించింది. ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును చూసైనా ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ నైతికతతో వ్యవహరించాలని అంబటిరాంబాబు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తిస్తుందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ చేసిన పనినే ఏపీలో చంద్రబాబు కూడా చేశారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు తప్పు అని మాట్లాడుతున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఫిరాయింపులపై మరోలా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. రెండు నాల్కుల ధోరణిని టీడీపీ వీడాలని సూచించారు అంబటి. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపులపై తామూ హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

మరోవైపు కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. మంజునాథ కమిషన్‌ వద్దకు బీసీలను రెచ్చగొట్టి పంపుతున్నది టీడీపీ నేతలేనని అన్నారు. కమిషన్ ముందు టీడీపీ నేతలు అల్లరి చేయిస్తున్నా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీసీలకు నష్టం లేకుండా కాపులను బీసీల్లో చేర్చాలి అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

First Published:  21 Sept 2016 6:35 PM IST
Next Story