Telugu Global
NEWS

వంచనకు బంధాలు ఉండవని గుర్తించిన టీడీపీ అనుకూల గ్రామం

రాజధాని ప్రాంత రైతులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రాజధాని కోసం నమ్మి భూములిచ్చిన టీడీపీ అభిమాన గ్రామాలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్లాట్ల కేటాయింపులో మాట మార్చేసింది. ఇది వరకు ఇస్తామన్నట్టుగా కాకుండా వేరే గ్రామాల్లో రైతులకు ప్లాట్లు కేటాయిస్తున్నారు. ప్లాట్లు కేటాయించి పంపిణీ చేసేందుకు వెళ్లిన అధికారులను రైతులు నిలదీస్తున్నారు. భూమి తీసుకునే సమయంలో ఇంటింటికి తిరిగి నమ్మించిన మంత్రులు పుల్లారావు, నారాయణ మాత్రం ఇప్పుడు పత్తా లేరు. దీంతో తమను […]

వంచనకు బంధాలు ఉండవని గుర్తించిన టీడీపీ అనుకూల గ్రామం
X

రాజధాని ప్రాంత రైతులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రాజధాని కోసం నమ్మి భూములిచ్చిన టీడీపీ అభిమాన గ్రామాలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్లాట్ల కేటాయింపులో మాట మార్చేసింది. ఇది వరకు ఇస్తామన్నట్టుగా కాకుండా వేరే గ్రామాల్లో రైతులకు ప్లాట్లు కేటాయిస్తున్నారు. ప్లాట్లు కేటాయించి పంపిణీ చేసేందుకు వెళ్లిన అధికారులను రైతులు నిలదీస్తున్నారు. భూమి తీసుకునే సమయంలో ఇంటింటికి తిరిగి నమ్మించిన మంత్రులు పుల్లారావు, నారాయణ మాత్రం ఇప్పుడు పత్తా లేరు. దీంతో తమను మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటపాలెం గ్రామం తొలినుంచీ కూడా టీడీపీకి అనుకూలమైన గ్రామంగా పేరుంది. తొలుత వారికి గ్రామ పరిధిలోనే ప్లాట్లు కేటాయిస్తామని నేతలు చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం వారికి పెనుమాక రెవెన్యూ డివిజన్‌లో భూములు కేటాయిస్తున్నారు. అంతే కాదు కమర్షియల్ ప్లాట్లు కూడా ఎక్కడో దూరంగా ఇస్తున్నారు. దీంతో వాటిని తామేమీ చేసుకోవాలని రైతులు నిలదీస్తున్నారు. కేవలం ఒక నేలపాడులో మాత్రమే గ్రామపరిధిలో ప్లాట్లు కేటాయించారు. మిగిలిన అన్ని గ్రామాల రైతులకు ఇప్పుడు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.

అయితే అధికారులు మాత్రం కొండవీటి వాగు పరీవాహకాన్ని మార్చడంతో ప్లాన్ కూడా మారిందని అందువల్లే గతంలో చెప్పినట్టుగా రైతులకు ప్లాట్లు కేటాయించలేకపోతున్నామని చెబుతున్నారు. మంత్రులు,టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పుడు రైతులను పలకరించే సాహసం కూడా చేయడం లేదు. రెండున్నరేళ్లు అవుతున్నా రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టలేకపోయిన ప్రభుత్వం ఆ జాప్యానికి కారణం రైతులే అని ప్రచారం చేసే ఉద్దేశంతో ప్లాట్ల పంపిణీ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోందా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు మీద నమ్మకంతో, టీడీపీ ప్రభుత్వానికి మంచిపేరురావాలన్న ఉద్దేశంతో తాము భూములు అప్పగిస్తే ఇప్పుడు తమ గోడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని టీడీపీ అనుకూల గ్రామాల రైతులు కూడా వాపోతున్నారు.

First Published:  21 Sept 2016 6:30 PM IST
Next Story