బన్నీ ఇప్పుడు అక్కడ కన్నేశాడు...
తెలుగులో ఇప్పటికే హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. అటు కేరళలో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సో… తెలుగు-మలయాళం కవర్ అయిపోయినట్టే. ఇక మిగిలింది కీలకమైన తమిళ మార్కెట్ ఒక్కటే. దానికి కూడా ఓ మెగా స్కెచ్ రెడీ చేశాడు అల్లు అర్జున్. త్వరలోనే తమిళనాట సోలోగా సినిమాను విడుదల చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఎన్నాళ్లనుంచో లిస్ట్ లో ఉన్న లింగుస్వామి దర్శకత్వంలో, తెలుగు-తమిళ భాషల్లో సినిమా చేసేందుకు బన్నీ ఒప్పుకున్నాడు. జ్ఞానవేల్ […]
BY sarvi22 Sept 2016 10:50 AM IST
X
sarvi Updated On: 22 Sept 2016 11:19 AM IST
తెలుగులో ఇప్పటికే హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. అటు కేరళలో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సో… తెలుగు-మలయాళం కవర్ అయిపోయినట్టే. ఇక మిగిలింది కీలకమైన తమిళ మార్కెట్ ఒక్కటే. దానికి కూడా ఓ మెగా స్కెచ్ రెడీ చేశాడు అల్లు అర్జున్. త్వరలోనే తమిళనాట సోలోగా సినిమాను విడుదల చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఎన్నాళ్లనుంచో లిస్ట్ లో ఉన్న లింగుస్వామి దర్శకత్వంలో, తెలుగు-తమిళ భాషల్లో సినిమా చేసేందుకు బన్నీ ఒప్పుకున్నాడు. జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో స్టుడియో గ్రీన్ పతాకంపై ఈ సినిమా తమిళనాట విడుదలకానుంది. ఇదే సినిమాతో స్టుడియో గ్రీన్ సంస్థ తెలుగులో కూడా ప్రొడక్షన్ రంగంలోకి ఎంటర్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే పూర్తయిపోయాయి. హరీష్ శంకర్ సినిమాను కొంతభాగం పూర్తిచేసిన తర్వాత… వెంటనే లింగుస్వామి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు బన్నీ. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు.
Click on Image to Read:
Next Story