Telugu Global
NEWS

మొదటికొచ్చిన బొమ్మల కథ

రెండున్నరేళ్లు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ అమరావతి  డిజైన్‌ను కూడా ఫైనల్ చేయలేకపోయింది. ఇప్పటికే పలు డిజైన్లు ఓకే చేసి తర్వాత తిరస్కరించిన ప్రభుత్వం తాజాగా జపాన్‌కు చెందిన మాకీ సంస్థతో ఒప్పందాలు రద్దు చేసేందుకు సిద్దమైంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. అమరావతి ప్రధాన భవనాల డిజైన్ల కోసం మాకీతో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు డిజైన్లు సమర్పించాయి. మాకీ సంస్థ కిరోసిన్ కొలిచే డబ్బా తరహాలో భవనాలను డిజైన్ […]

మొదటికొచ్చిన బొమ్మల కథ
X

రెండున్నరేళ్లు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ అమరావతి డిజైన్‌ను కూడా ఫైనల్ చేయలేకపోయింది. ఇప్పటికే పలు డిజైన్లు ఓకే చేసి తర్వాత తిరస్కరించిన ప్రభుత్వం తాజాగా జపాన్‌కు చెందిన మాకీ సంస్థతో ఒప్పందాలు రద్దు చేసేందుకు సిద్దమైంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. అమరావతి ప్రధాన భవనాల డిజైన్ల కోసం మాకీతో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు డిజైన్లు సమర్పించాయి. మాకీ సంస్థ కిరోసిన్ కొలిచే డబ్బా తరహాలో భవనాలను డిజైన్ చేసిఇచ్చింది. దీన్ని దాదాపు చంద్రబాబు ఓకే చేసేశారు. రూ. 87 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అయితే అమరావతి డిజైన్లు చూసి పాకిస్తాన్ మీడియా ఏపీలో అణుధార్మిక కేంద్రం నిర్మిస్తున్నారని ప్రచారం చేసింది. దీంతో ఆ డిజైన్లు నవ్వుల పాలయ్యాయి. ఈ నేపథ్యంలో మాకీతో ఒప్పందం రద్దు చేసుకోవాలని మంగళవారం జరిగిన సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. అమరావతి ప్రధాన భవనాల డిజైన్ కోసం కొత్తగా గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మొత్తం మీద మళ్లీ టెండర్లు పిలిచి, ఆయా కంపెనీలు డిజైన్లు సమర్పించి వాటిని ఓకే చేసేందుకు ఇంకెంత కాలం పడుతుందో!.

Click on Image to Read:

ys-jagan

lokesh

gorantla-butchaih-chowdary

First Published:  21 Sept 2016 4:46 AM IST
Next Story