24 మందిని పొట్టనబెట్టుకున్నాడు!
నరహంతకుడు నయీం, అతని ముఠాతో కలిసి చేసిన హత్యలు ఎన్నో తెలుసా? 24 . అవును, అక్షరాల 24 మందిని పొట్టనబెట్టుకున్నాడు. తన అక్రమాలను ప్రశ్నించినందుకు, అడ్డుగా నిలిచినందుకే వీరందరిని అడ్డుతొలగించుకున్నాడు. కసాయివాడు మేకలను నరికినంత సులువుగా మనుషులను నిలువునా నరికి చంపడం నయీంకు వెన్నతో పెట్టిన విద్య. అసెంబ్లీ సమావేశాలకు ముందే నయీం కేసును ఓ కొలిక్కి తీసుకురావాలన్న నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందుకే, ఈకేసును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఇటీవల అదనంగా ఐపీఎస్ […]
BY sarvi19 Sept 2016 11:11 PM GMT
X
sarvi Updated On: 20 Sept 2016 1:41 AM GMT
నరహంతకుడు నయీం, అతని ముఠాతో కలిసి చేసిన హత్యలు ఎన్నో తెలుసా? 24 . అవును, అక్షరాల 24 మందిని పొట్టనబెట్టుకున్నాడు. తన అక్రమాలను ప్రశ్నించినందుకు, అడ్డుగా నిలిచినందుకే వీరందరిని అడ్డుతొలగించుకున్నాడు. కసాయివాడు మేకలను నరికినంత సులువుగా మనుషులను నిలువునా నరికి చంపడం నయీంకు వెన్నతో పెట్టిన విద్య. అసెంబ్లీ సమావేశాలకు ముందే నయీం కేసును ఓ కొలిక్కి తీసుకురావాలన్న నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందుకే, ఈకేసును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఇటీవల అదనంగా ఐపీఎస్ అధికారులను కూడా చేర్చారు. నయీం ఇంతమందిని హత్య చేస్తుంటే ఎవరికీ అనుమానం రాలేదా? వీరందరినీ ఎప్పుడు, ఎలా హత్య చేశాడు? వారి మృతదేహాలను ఎలా మాయం చేశాడు అన్న విషయాలపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరికోసం ఎన్ని హత్యలు?
నయీం చేసిన హత్యలు వాటికి గల కారణాలు, లావాదేవీలకు సంబంధించి కూపీ లాగే పనిలో ఉన్నారు పోలీసులు. వీటిలో మెజారిటీ హత్యలు భూదందాల్లో భాగంగా చేసినవే కావడం గమనార్హం. అందుకే, నయీం తన స్వార్థంకోసం చేసిన హత్యలెన్ని? వీటిలో నయీంతో అంటకాగిన రాజకీయ నాయకుల కోసం చేసినవెన్ని? ఇక పోలీసు అధికారులు చేయించినవెన్ని లెక్క తేలాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక విభాగం రంగంలోకి దిగింది. పనిలోపనిగా మరో బృందం రిజిస్ర్టేషన్ల శాఖకు లేఖ రాసింది. నయీంతో అంటకాగిన పోలీసులు, రాజకీయ నాయకుల ఆస్తులు, భూముల వివరాలు ఇవ్వాలని సిట్ అధికారులు లేఖలో కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నయీం పేరిట కోట్లాది రూపాయల భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు సహకరించిన రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు.
Next Story