జగన్, సాయిరెడ్డే ప్రధాన సూత్రధారులు- బుచ్చయ్య
తుని ఘటనలో జగన్, విజయసాయిరెడ్డిలే ప్రధాన సూత్రధారులని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాపు సామాజికవర్గానికి చెందని భూమనకు కాపు గర్జనతో సంబంధమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు బుచ్చయ్య. అయితే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇదే ప్రశ్న అడిగారు. అసలు కాపుల మీటింగ్‌కు తనకు ఏం సంబంధం అని. ఇప్పుడు బుచ్చయ్య కూడా అదే ప్రశ్నతో భూమనను నిలదీశారు. తమిళనాడులో అయి ఉంటే అసెంబ్లీలో వైసీపీ నాయకుల […]
తుని ఘటనలో జగన్, విజయసాయిరెడ్డిలే ప్రధాన సూత్రధారులని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాపు సామాజికవర్గానికి చెందని భూమనకు కాపు గర్జనతో సంబంధమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు బుచ్చయ్య. అయితే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇదే ప్రశ్న అడిగారు. అసలు కాపుల మీటింగ్‌కు తనకు ఏం సంబంధం అని. ఇప్పుడు బుచ్చయ్య కూడా అదే ప్రశ్నతో భూమనను నిలదీశారు. తమిళనాడులో అయి ఉంటే అసెంబ్లీలో వైసీపీ నాయకుల తీరు కారణంగా తీసుకెళ్లి జైల్లో పెట్టేవారని గోరంట్ల ఫైర్ అయ్యారు. రాజధాని అక్రమాలపై జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, ఏడాది సస్పెన్షన్‌పై రోజాలు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు అవసరమైన కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు.
మరోవైపు తుని కేసులో భూమన కరుణాకర్‌రెడ్డిని సీఐడీ మంగళవారం దాదాపు 8గంటల పాటు విచారించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి… చంద్రబాబు గ్యాంగ్‌స్టర్ నయీం, జడల నాగరాజు తరహాలో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు హయాంలో 400 మందిని హత్య చేస్తే ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు కాలేదన్నారు. తుని ఘటన జరిగిన వెంటనే దాని వెనుక భూమన కరుణాకర్ రెడ్డి హస్తముందని ఆరోపణలు చేసిన చంద్రబాబు, నిమ్మకాయల చినరాజప్పలకు తొలుత నోటీసులు ఇచ్చి విచారించాలన్నారు భూమన. చంద్రబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఎప్పుడు పిలిచినా విచారణకు వచ్చేందుకు సిద్ధమన్నారు.
Click on Image to Read: