స్విస్ చాలెంజ్ వణుకు... అత్యవసరంగా విజయవాడకు...
స్వీస్ చాలెంజ్ విధానంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, రాజధాని నిర్మాణానికి ఇది సరైన మార్గం కాదని ప్రతిపక్షాలు, మేధావులు సూచించినా లెక్కచేయకుండా ముందుకెళ్లిన చంద్రబాబు ప్రభుత్వానికి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. స్వీస్ చాలెంజ్ విధానంపై పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు … ప్రభుత్వం విధానంపై ప్రతికూలంగా స్పందిస్తుండడంతో ప్రభుత్వంలో అలజడి చెలరేగుతోంది. మంగళవారం కూడా స్విస్ చాలెంజ్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా హైకోర్టు పలు కీలక ప్రశ్నలు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌కు సంధించింది. సింగపూర్ కంపెనీలు […]
స్వీస్ చాలెంజ్ విధానంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, రాజధాని నిర్మాణానికి ఇది సరైన మార్గం కాదని ప్రతిపక్షాలు, మేధావులు సూచించినా లెక్కచేయకుండా ముందుకెళ్లిన చంద్రబాబు ప్రభుత్వానికి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. స్వీస్ చాలెంజ్ విధానంపై పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు … ప్రభుత్వం విధానంపై ప్రతికూలంగా స్పందిస్తుండడంతో ప్రభుత్వంలో అలజడి చెలరేగుతోంది. మంగళవారం కూడా స్విస్ చాలెంజ్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా హైకోర్టు పలు కీలక ప్రశ్నలు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌కు సంధించింది. సింగపూర్ కంపెనీలు అమరావతిలో ఏం చేస్తాయని ప్రశ్నించగా మౌలికసదుపాయాలు కల్పిస్తాయని చెప్పారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తి మౌలిక సదుపాయాల కల్పనకు సింగపూర్ కంపెనీలే ఎందుకు కావాలని ప్రశ్నించారు.
మొదటి విడత బిడ్డింగ్‌లో నిబంధనలు చూస్తుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపించేలా ఉన్నాయని అభిప్రాయపడింది కోర్టు. విదేశీ పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా స్విస్ చాలెంజ్ నిబంధనలు తయారు చేశామని కోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్ విన్నవించినా కోర్టు సంతృప్తి చెందినట్టు కనిపించలేదు. ఈ నేపథ్యంలో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తుందన్న ఆందోళన చంద్రబాబు అండ్ టీంలో మొదలైంది. దీంతో మంగళవారం రాత్రి అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాసరావు అత్యవసరంగా విమానంలో విజయవాడ వచ్చారు. సీఎంతో సమావేశమై స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు తీరును వివరించారు. స్వీస్‌చాలెంజ్‌పై కోర్టు చాలా నిశితంగా ప్రశ్నలు సంధిస్తుండడం, సింగపూర్ కంపెనీ సీల్డ్ కవర్ వంటి వాటిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో చంద్రబాబుతో ఏజీ చర్చించారు. ఈ గండం ఎలా గట్టెక్కాలన్న దానిపై చర్చించినట్టు చెబుతున్నారు.
Click on Image to Read: