అమిత్‌షా పై టీఆర్ఎస్ ఆగ్రహం
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది.. అంత పెద్ద పార్టీకి జాతీయాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అమిత్‌షా. ఒకసారంటే ఏదో పొరపాటు అనుకోవచ్చు. కానీ, రెండోసారి కూడా కెలికీ మరీ తిట్టించుకుంటే ఏమనాలి? అసలు అమిత్‌షా ఉద్దేశమేంటి? తెలంగాణకు ఊరికే నిధులు ఇస్తున్నామని ఒక్కసారి చెప్పి టీఆర్ ఎస్ నేతలతో తలంటు పోయించుకున్న అమిత్‌షా తీరు ఏమాత్రం మారలేదు. ఒక అబద్దాన్నే రెండోసారి చెబితే ఏమనుకోవాలి? దాన్ని అవతలి వారిపై బురదజల్లే ప్రయత్నమేనని అంతా […]
BY sarvi19 Sept 2016 7:04 AM IST
X
sarvi Updated On: 19 Sept 2016 8:40 AM IST
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది.. అంత పెద్ద పార్టీకి జాతీయాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అమిత్‌షా. ఒకసారంటే ఏదో పొరపాటు అనుకోవచ్చు. కానీ, రెండోసారి కూడా కెలికీ మరీ తిట్టించుకుంటే ఏమనాలి? అసలు అమిత్‌షా ఉద్దేశమేంటి? తెలంగాణకు ఊరికే నిధులు ఇస్తున్నామని ఒక్కసారి చెప్పి టీఆర్ ఎస్ నేతలతో తలంటు పోయించుకున్న అమిత్‌షా తీరు ఏమాత్రం మారలేదు. ఒక అబద్దాన్నే రెండోసారి చెబితే ఏమనుకోవాలి? దాన్ని అవతలి వారిపై బురదజల్లే ప్రయత్నమేనని అంతా అనుకుంటారు అంటున్నారు టీఆర్ఎస్ నేతలు.
గతంలో సూర్యాపేటలో చెప్పిన అబద్దాన్నే మరోసారి చెప్పారు అమిత్‌షా. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని వరంగల్ వేదికగా ప్రశ్నించారు. అంతవరకూ బాగానే ఉంది. తెలంగాణకు మేం చాలా ఉదారంగా.. ఉత్తినే నిధులు ఇస్తున్నాం అంటూ బిల్డప్ ఇచ్చారు. అంతే, గులాబీ నేతలు ఎందుకు ఊరుకుంటారు? అమిత్‌షాకు ఘాటైన విమర్శలతో తలంటుపోశారు. తెలంగాణ పాలనను మోదీ మెచ్చుకుంటుంటే.. అమిత్‌షా అబద్దాలు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. తెలంగాణకు మూడేళ్లలో కేవలం రూ.40 వేల కోట్లు ఇచ్చి రూ.90 వేల కోట్లని అబద్దాలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే నిజం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. మీ చరిత్ర ఎవరికి తెలియదని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మీరా మాట్లాడేది.. అధికార బలంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న మీరా ఇక్కడికి వచ్చి నీతులు వల్లెవేసేది అని విమర్శించారు. ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్‌లో మీరేం చేశారో దేశమంతటికి తెలుసని ఎద్దేవా చేశారు. తెలంగాణను మీరు ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఇక్కడ మత రాజకీయాలకు తావులేదన్నారు. మత సామరస్యంతో పరిఢవిల్లుతున్న తెలంగాణలో మతచిచ్చు రాజేయాలన్న మీ కుట్రలు ఇక్కడ సాగవని తేల్చిచెప్పారు.
Click on Image to Read:
Next Story