అనంత టీడీపీలో కులచిచ్చు... పాత విషయాలు చెబుతున్న స్వరూప
అనంత టీడీపీలో కులచిచ్చు రాజుకుంటోంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నేరుగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ మదమంచి స్వరూపలకు కులగజ్జి ఎక్కువైందని అందుకే అనంత కార్పొరేషన్ నాశనమవుతోందని మీడియాముఖంగా ఆరోపించి సంచలనం సృష్టించారు. కార్పొరేషన్ కమిషనర్‌గా కూడా వారి సామాజికవర్గం వ్యక్తినే తెచ్చిపెట్టుకున్నారని, అవినీతి పెచ్చరిల్లిందని చెప్పి టీడీపీలో కలకలం రేపారు. అయితే జేసీకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు ప్రభాకర్ చౌదరి, స్వరూప. ఒక అడుగు ముందుకేసిన మదమంచి స్వరూప.. కార్పొరేషన్ అవినీతిపై […]
అనంత టీడీపీలో కులచిచ్చు రాజుకుంటోంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నేరుగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ మదమంచి స్వరూపలకు కులగజ్జి ఎక్కువైందని అందుకే అనంత కార్పొరేషన్ నాశనమవుతోందని మీడియాముఖంగా ఆరోపించి సంచలనం సృష్టించారు. కార్పొరేషన్ కమిషనర్‌గా కూడా వారి సామాజికవర్గం వ్యక్తినే తెచ్చిపెట్టుకున్నారని, అవినీతి పెచ్చరిల్లిందని చెప్పి టీడీపీలో కలకలం రేపారు. అయితే జేసీకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు ప్రభాకర్ చౌదరి, స్వరూప. ఒక అడుగు ముందుకేసిన మదమంచి స్వరూప.. కార్పొరేషన్ అవినీతిపై మాట్లాడే అర్హత దివాకర్ రెడ్డికి లేదన్నారామె. పార్టీ క్రమశిక్షణ సంఘానికి జేసీపై ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయితే టీడీపీ నేతల కుల విమర్శల నేపథ్యంలో జిల్లాలో ఏ కులం ఏ పదవిలో ఉందన్న లెక్కలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలు పరిటాల సునీత (మంత్రి), వరదాపురం సూరి, ప్రభాకర్ చౌదరి, హనుమంతరాయచౌదరి, హీరో బాలకృష్ణతో పాటు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, నగర మేయర్ స్వరూప వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వీరితో పాటు పలు కీలక పదవులు కూడా టీడీపీ నుంచి ఒకేసామాజికవర్గం వారికి దక్కుతున్నాయన్నది టీడీపీలోని మిగిలిన వర్గాల అభ్యంతరం. ఆ కోపం ముదిరిపాకానపడడం వల్లే ఇప్పుడు నేతలు నేరుగా కులాల పేర్లతో తిట్టుకునే స్థాయికి పరిస్థితి వచ్చిందంటున్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలో విషజ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి. జ్వరపీడితులతో ఆస్పత్రులు నిండిపోయాయి. జ్వరాలతో ఆదివారం ఒక్కరోజే వెయ్యి మంది రోగులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. దీంతో అదనపు బెడ్లు ఏర్పాటు చేసే పనిలో అధికారులున్నారు. పరిస్థితి ఇంత తీవ్రస్థాయికి చేరే వరకు ప్రభుత్వం ఏం చేస్తోందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.
Click on Image to Read: