హర్యానాలో ఆవుల విశ్వవిద్యాలయం
హర్యానా ప్రభుత్వ గో సేవా కమిటి ఒక “ఆవుల విశ్వవిద్యాలయం”ను ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ విశ్వవిద్యాలయంలో గోవుల గురించి, ఆవు పాల గురించి, గో మూత్రం, ఆవుల పేడ గురించి విస్తృత పరిశోధనలు నిర్వహించాలనుకుంటున్నారు. హర్యానా గో సేవా కమిటి చైర్మన్ బనిరామ్‌మంగ్లా ఆవుల విశ్వవిద్యాలయం ప్రణాళికలతో సోమవారం లేదా మంగళవారం నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తమ నివేదికను ఇవ్వనున్నారు. ఈ విశ్వవిద్యాలయం కోసం 500ల ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా కోరనున్నారు. ఈ […]

హర్యానా ప్రభుత్వ గో సేవా కమిటి ఒక “ఆవుల విశ్వవిద్యాలయం”ను ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ విశ్వవిద్యాలయంలో గోవుల గురించి, ఆవు పాల గురించి, గో మూత్రం, ఆవుల పేడ గురించి విస్తృత పరిశోధనలు నిర్వహించాలనుకుంటున్నారు.
హర్యానా గో సేవా కమిటి చైర్మన్ బనిరామ్‌మంగ్లా ఆవుల విశ్వవిద్యాలయం ప్రణాళికలతో సోమవారం లేదా మంగళవారం నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తమ నివేదికను ఇవ్వనున్నారు. ఈ విశ్వవిద్యాలయం కోసం 500ల ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా కోరనున్నారు.
ఈ విశ్వవిద్యాలయంలో ఆవుల మీద మాత్రమే పరిశోధనలు జరుగుతాయని చెబుతున్నారు. ఇక్కడ గోవుల గురించి, ఆవు పాలగురించి, గో మూత్రం, పేడ గురించి విస్తృత పరిశోధనలు చేయదలుచుకున్నవిద్యార్ధులకు డిప్లమా కోర్సులను నిర్వహిస్తారట. ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తే గో ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుందని, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కమిటి చైర్మన్ బనిరామ్‌మంగ్లా అంటున్నారు.
Click on Image to Read: