మింగుడుపడకపోతే గొంతులో నీళ్లు పోసి...
ఈ మధ్యే టీడీపీలో చేరిన మాజీ మంత్రి దేవినేని నెహ్రు అప్పుడే స్వరం పెంచుతున్నారు. తాను పార్టీలో చేరుతున్న సందర్బంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌కు వల్లభనేని వంశీ, బోడె ప్రసాద్ తదితరులు హాజరుకాకపోవడంతో నెహ్రు తనదైన శైలిలో స్పందించారు. మీ రాక ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదట కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… ఎవరికి మింగుడు పడకపోయినా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఒకవేళ వారికి మింగుడుపడకపోతే చంద్రబాబే వారి గొంతుల్లో నీళ్లు పోస్తారని […]
ఈ మధ్యే టీడీపీలో చేరిన మాజీ మంత్రి దేవినేని నెహ్రు అప్పుడే స్వరం పెంచుతున్నారు. తాను పార్టీలో చేరుతున్న సందర్బంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌కు వల్లభనేని వంశీ, బోడె ప్రసాద్ తదితరులు హాజరుకాకపోవడంతో నెహ్రు తనదైన శైలిలో స్పందించారు. మీ రాక ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదట కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… ఎవరికి మింగుడు పడకపోయినా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఒకవేళ వారికి మింగుడుపడకపోతే చంద్రబాబే వారి గొంతుల్లో నీళ్లు పోస్తారని అప్పుడు వారికి మింగుడు పడుతుందని వ్యాఖ్యానించారు. తాను ఏ ఒక్క నియోజకవర్గానికి పరిమితమైన నేతను కాదన్నారు. జిల్లా నలుమూలలా తనకు వర్గం ఉందని చెప్పారు. తనను నమ్ముకుని తనతో పాటు చాలా మంది టీడీపీలోకి వచ్చారని వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాను పార్టీకి పనికొస్తాననుకుంటే పక్కలో పెట్టుకుంటారని… పనికి రాననుకుంటే పక్కకుతోసేస్తారని, ఎవరి విషయంలోనైనా ఇలాగే జరుగుతుందన్నారు నెహ్రు. తనను ఎలా ఉపయోగించుకోవాలన్నది చంద్రబాబే నిర్ణయిస్తారని చెప్పారు.
Click on Image to Read: