క్షణాలు లెక్కబెట్టుకుంటున్న ఎమ్మెల్సీలు!
నయీం వ్యవహారంలో నిండామునిగిన అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఇప్పుడు క్షణాలు లెక్కబెట్టుకుంటున్నారు. వీరిని కలిసేందుకు సీఎం నిరాకరించడంతో అన్ని దారులు మూసుకుపోయాయి. రెండు, మూడురోజుల్లో వీరిని పోలీసులు విచారణకు పిలిచి అదుపులోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో వీరు ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఆశ్రయిస్తున్నారు.. బాధితులను ఫిర్యాదులు వాపసు తీసుకునేలా చేయాలని, లేదంటే సిట్ విచారణలో తమ పేర్లు ప్రస్తావించకుండా ఉండేలా చూడాలని వేడుకుంటున్నారు. బాధితుల్లో కొందరు కాంగ్రెస్ నాయకులతో సంబంధమున్నవారు […]
BY sarvi18 Sept 2016 5:43 AM IST
sarvi Updated On: 18 Sept 2016 5:46 AM IST
నయీం వ్యవహారంలో నిండామునిగిన అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఇప్పుడు క్షణాలు లెక్కబెట్టుకుంటున్నారు. వీరిని కలిసేందుకు సీఎం నిరాకరించడంతో అన్ని దారులు మూసుకుపోయాయి. రెండు, మూడురోజుల్లో వీరిని పోలీసులు విచారణకు పిలిచి అదుపులోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో వీరు ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఆశ్రయిస్తున్నారు.. బాధితులను ఫిర్యాదులు వాపసు తీసుకునేలా చేయాలని, లేదంటే సిట్ విచారణలో తమ పేర్లు ప్రస్తావించకుండా ఉండేలా చూడాలని వేడుకుంటున్నారు. బాధితుల్లో కొందరు కాంగ్రెస్ నాయకులతో సంబంధమున్నవారు ఉండటమే ఇందుకు కారణం.
నయీం కేసులో ఫిర్యాదు చేసిన భువనగిరికి చెందిన ఓ వ్యాపారికి కరీంనగర్‌కు చెందిన మాజీమంత్రి (కాంగ్రెస్)కి మంచి స్నేహితుడు. ఈయన వద్ద నుంచి నయీం ముఠా భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మధ్యవర్తిగా ఉన్నాడని ఆయన ఇటీవల సిట్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు ఎమ్మెల్సీ ఈ కేసులో నిండా కూరుకుపోయాడు. అందుకే, సదరు వ్యాపారిని కేసు వాపసు తీసుకుంటే.. నయీంకి చెల్లించిన మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేస్తానని అతని సన్నిహిత కాంగ్రెస్ నేత ద్వారా బేరసారాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
మరో ఎమ్మెల్యే పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. నిన్న మొన్నటి దాకా అధికార పార్టీ తరఫున టీవీ కార్యక్రమాల్లో కేసీఆర్ పక్షాన తెగ వాదించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈ నేత చురగ్గా పాల్గొన్నారు. ఇతనికి నయీంతో ఉన్న లింకులు బయటపడటంతో సీఎం అపాయింట్మెంట్ కూడా నిరాకరించాడు. ఈ ఎమ్మెల్సీకి మరో అధికార పార్టీ నేత అండ కూడా ఉండేది. నయీం ప్రధాన అనుచరులైన పాశం శ్రీను, సుధాకర్‌లపై పీడీ యాక్టు కింద నమోదైన కేసులో వారిద్దరినీ అరెస్టు కాకుండా అడ్డుకున్నాడు. కానీ, సిట్ అధికారులు అరెస్టు చేస్తారన్న భయంతో సదరు నేత దేశం విడిచి పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఎమ్మెల్సీ పరిస్థితి అయోమయంగా మారింది. అరెస్టు తప్పదన్న భయంతో అడపాదడపా అధికార పార్టీ తరఫున ప్రతిపక్షాలను విమర్శిస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు.
మొత్తానికి నయీం వ్యవహారంలో తొలి అరెస్టులు వీరిద్దరివే కావడం వీరి అనుచరుల్లో అలజడి రేపుతోంది. నిన్న మొన్నటి దాకా ఎదురులేదనుకున్న వీరి చేతులకు త్వరలోనే అరదండాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది
Next Story