Telugu Global
NEWS

రాజధాని దందాపై ఏబీకే మరో అడుగు

ఏపీ రాజధాని చుట్టూ అనేక వివాదాలు కమ్ముకుంటున్నాయి. చంద్రబాబు రాజధాని విషయంలో ప్రతి అడుగు ఏకపక్షంగా వేసిన కారణంగా ఇప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయి. స్విస్ చాలెంజ్‌పై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్… ఢిల్లీ పెద్దల తలుపు తట్టారు. అమరావతి పేరుతో జరుగుతున్న విధ్వంసంపై మీరైనా స్పందించండి అంటూ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖలు రాశారు. లేఖలో రాజధానికి సంబంధించిన విషయాలను వివరించారు. రాజధాని బాధితుల పక్షాన […]

రాజధాని దందాపై  ఏబీకే మరో అడుగు
X

ఏపీ రాజధాని చుట్టూ అనేక వివాదాలు కమ్ముకుంటున్నాయి. చంద్రబాబు రాజధాని విషయంలో ప్రతి అడుగు ఏకపక్షంగా వేసిన కారణంగా ఇప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయి. స్విస్ చాలెంజ్‌పై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్… ఢిల్లీ పెద్దల తలుపు తట్టారు. అమరావతి పేరుతో జరుగుతున్న విధ్వంసంపై మీరైనా స్పందించండి అంటూ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖలు రాశారు. లేఖలో రాజధానికి సంబంధించిన విషయాలను వివరించారు. రాజధాని బాధితుల పక్షాన తాను వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించిన విధానాన్ని కూడా వివరించారు.

కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణణ్ కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి చంద్రబాబు సొంతంగా తనకు కావాల్సిన రియల్‌ ఎస్టేట్ వ్యాపారులతో వేసిన కమిటీ ఆధారంగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారని లేఖలో వివరించారు. కమిటీలోని వారంతా చంద్రబాబు చేతుల్లో కేవలం పావులు మాత్రమేనన్నారు. ప్రస్తుత ప్రాంతంలో రాజధాని నిర్మాణం వల్ల చుట్టుపక్కల 15 లక్షల ఎకరాల సారవంతమైన భూముల్లో ఆహార ఉత్పత్తి దెబ్బతింటుందని వివరించారు. ఇది దేశ ఆహారభద్రతపైనే పెను ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో రాజధాని నిర్మాణం కారణంగా భారీగా రైతులు, రైతు కూలీలు, కులవృత్తుల వారు వలస వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో ప్రజాప్రయోజనాల కోసం అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు స్వచ్చందంగా విచారించిందని రాజధాని విషయంలో మాత్రం అలా జరగలేదని లేఖలో వివరించారు.

abk-01-copy abk-02-copy abk-03-copy abk-04-copy

Click on Image to Read:

mohan-babu

venkaiah-naidu

geetha-scams

First Published:  17 Sept 2016 2:16 PM IST
Next Story