Telugu Global
NEWS

"చైనా"ను అధిగమించిన గురుకుల విద్యార్ధులు

చైతన్య, నారాయణ (చైనా) విజయాల రంకెలు, అరుపులు, కేకలు, బీభత్స ప్రకటనల మధ్య గురుకుల విద్యార్ధులు సాధించిన విజయం తెరమరుగైంది. ఎంసెట్‌-3 ఫలితాల్లో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్ధులు అద్భుత విజయాలు సాధించారు. ఈ విద్యాసంవత్సరంలో గురుకుల శాఖ 110 మంది విద్యార్ధులను ఎంపిక చేసి ఎంసెట్‌లో శిక్షణ ఇప్పించగా వారిలో 60 మందికి సీట్లు లభిస్తాయని తెలిసింది. ఈ విజయం సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు […]

చైనాను అధిగమించిన గురుకుల విద్యార్ధులు
X

చైతన్య, నారాయణ (చైనా) విజయాల రంకెలు, అరుపులు, కేకలు, బీభత్స ప్రకటనల మధ్య గురుకుల విద్యార్ధులు సాధించిన విజయం తెరమరుగైంది. ఎంసెట్‌-3 ఫలితాల్లో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్ధులు అద్భుత విజయాలు సాధించారు. ఈ విద్యాసంవత్సరంలో గురుకుల శాఖ 110 మంది విద్యార్ధులను ఎంపిక చేసి ఎంసెట్‌లో శిక్షణ ఇప్పించగా వారిలో 60 మందికి సీట్లు లభిస్తాయని తెలిసింది. ఈ విజయం సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు దక్కుతుంది.

ప్రవీణ్‌ కుమార్‌ గురుకుల విద్యార్ధులకు విద్యాలోనే కాకుండా, ఆటల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే గురుకుల విద్యాలయ విద్యార్ధులిద్దరు హిమాలయ పర్వతాలను అధిరోహించి గురుకుల విద్యాసంస్ధల విజయపతాకాన్ని హిమాలయపర్వత శిఖరంపై ఎగురవేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థను సర్వనాశనం చేసి, విద్యార్ధులను ఆట పాటలకు దూరం చేసి, విద్యార్ధులను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ వాళ్ల జీవితాలను చిదిమేస్తున్న నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థల విజయాల ప్రచారం ముందు ఈ గురుకుల విద్యార్ధులు సాధించిన ఘన విజయం ప్రజల దృష్టికి రాలేదు.

లక్షలాదిమంది విద్యార్ధులను చేర్చుకుని వాళ్లల్లో వేళ్లమీద లెక్కపెట్టతగిన అతికొద్దిమంది సాధించే విజయాలను ప్రచారం చేసుకుంటూ విద్యా వ్యాపారాన్ని అతి నీచ స్థాయికి తీసుకువెళ్లిన నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థలలో ఎంతమంది పరీక్షలు రాశారు? ఎంతమంది పాసయ్యారు? ఎంతమంది ర్యాంకులు సాధించారు? ఎంతమందికి మెడిసిన్‌లో సీట్లు వస్తాయి? మొదలైన వివరాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజెప్పగలిగితే జనాలకు ఈ చైనా బ్యాచ్‌ భ్రమలు వదులుతాయని ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ సంస్థలు ఇచ్చే అడ్వర్‌టైజ్‌మెంట్‌ డబ్బులకు లొంగిపోయిన మీడియా కూడా ఈ చైనా బ్యాచ్‌ గురించి నిజాలు రాయదని, ప్రభుత్వమే పూనుకొని వాస్తవాలను వెల్లడించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు నాశనంకాకుండా కాపాడాలని ఉపాధ్యాయ సంఘాలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Click on Image to Read:

uma-reddy-venkateswarlu

geetha-scams

chittoor-mayor-katari-anuradha

First Published:  17 Sept 2016 9:18 AM IST
Next Story