Telugu Global
NEWS

దోమలను మేనేజ్ చేస్తున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోబెల్స్‌కు పెదనాన్నలా తయారైంది. గోబెల్స్‌ కూడా చేయలేని పనిని చంద్రబాబు చేస్తున్నారు. “హోదా వద్దు ప్యాకేజే ముద్దు” అని నమ్మించే ప్రయత్నం చేయడం, రాజధానిని త్రీడీ బొమ్మలతోనే జనానికి రంగుల రాజధాని చూపించడం, జరగని రైతు రుణమాఫీ జరిగిపోయినట్టు నమ్మించడం, చిల్లిగవ్వ కూడా చెల్లించకుండానే డ్వాక్రా మహిళలను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టున పడేసినట్టు నమ్మించడం, ప్రచారానికి పరాకాష్ట అన్నట్టు అనంతపురం జిల్లాలో రెండు రోజులు బస చేసి రెయిన్‌గన్‌ల సాయంతో ఫైర్ చేసి […]

దోమలను మేనేజ్ చేస్తున్న చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోబెల్స్‌కు పెదనాన్నలా తయారైంది. గోబెల్స్‌ కూడా చేయలేని పనిని చంద్రబాబు చేస్తున్నారు. “హోదా వద్దు ప్యాకేజే ముద్దు” అని నమ్మించే ప్రయత్నం చేయడం, రాజధానిని త్రీడీ బొమ్మలతోనే జనానికి రంగుల రాజధాని చూపించడం, జరగని రైతు రుణమాఫీ జరిగిపోయినట్టు నమ్మించడం, చిల్లిగవ్వ కూడా చెల్లించకుండానే డ్వాక్రా మహిళలను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టున పడేసినట్టు నమ్మించడం, ప్రచారానికి పరాకాష్ట అన్నట్టు అనంతపురం జిల్లాలో రెండు రోజులు బస చేసి రెయిన్‌గన్‌ల సాయంతో ఫైర్ చేసి కరువును కర్నాటక వైపు తరిమేశామని సమర్ధవంతంగా మేనేజ్‌మెంట్ చేస్తున్న చంద్రబాబు… ఇప్పుడు మరో అంకానికి తెరలేపారు. అయితే ఈసారి చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ డెంగ్యూ జ్వరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేని విధంగా విష జ్వరాలు విజృంభించాయి. ఏజెన్సీ ప్రాంతాల సంగతి అటుంచితే మైదాన ప్రాంతాల్లోనూ విష జ్వరాలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా చంద్రబాబు నివాసముంటున్న కృష్ణా జిల్లాలో ఈసారి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. వేలాది మంది విష జ్వరాల బారిన పడుతున్నారు. అందులో డెంగ్యూ కేసులే అత్యధికంగా ఉంటున్నాయి. కానీ చంద్రబాబు పాలనలో డెంగ్యూ జ్వరాలు జనానికి రావడమా!. అవమానం. చంద్రబాబు కూడా అలాగే భావించారు. అందుకే “మేనేజ్‌మెంట్ డెంగ్యూ దోమ”కు శ్రీకారం చుట్టారు.

ప్రైవేట్ ఆస్పత్రులుగానీ, ప్రభుత్వ ఆస్పత్రులు గానీ డెంగ్యూ కేసులను ప్రకటిస్తే ప్రభుత్వ పెద్దలు భగ్గుమంటున్నారని సమాచారం. ముఖ్యంగా ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు నిరంతరం డెంగ్యూ దోమలను నివారించడాన్ని పక్కన పెట్టి నిరంతరం డెంగ్యూ కేసుల నమోదును అరికట్టే పనిలో ఉన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు డెంగ్యూ కేసులను గుర్తించి వాటిని బయటకు ప్రకటిస్తే పెద్దల నుంచి బెదిరింపులు వెళ్తున్నాయని చెబుతున్నారు. డెంగ్యూ లేదు దగ్గు లేదు… మీరు పేషెంట్ల నుంచి డబ్బులు గుంజేందుకు ఈ ఎత్తులు వేస్తున్నారు, మీరు ఇలాగే వ్యవహరిస్తే ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాల్సి ఉంటుందని బెదిరిస్తున్నారు. అయితే మంత్రుల అంతరార్దం అర్థం కాని ఆస్పత్రుల యాజమాన్యాలు ఆఫ్‌లైన్‌లో ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందట. డెంగ్యూ కేసులు వచ్చినా సైలెంట్‌గా వైద్యం చేయండి… అంతేకానీ ఆ లెక్కలు బయటకు ప్రకటించి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేయవద్దని చెవిలో చెబుతున్నారట. అంటే డెంగ్యూ కేసులు నమోదైనా సరే వాటిని బయటకు ప్రకటించరు. సాధారణ జ్వరాలుగానే రికార్డుల్లో చూపేడుతారన్న మాట. కృష్ణా జిల్లాలో డెంగ్యూ తీవ్రతకు ఒక మంచి ఉదాహరణ కూడా ఉంది. టీడీపీ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా డెంగ్యూతో ఆస్పత్రిపాలయ్యారు. మొత్తం మీద ఏపీలో విషజ్వరాలు కూడా చంద్రబాబు మేనేజ్‌మెంట్ ముందు లెక్కల్లోకి ఎక్కడం లేదన్న మాట. పాపం పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు మేనేజ్మెంట్ స్కిల్స్‌ లేక డెంగ్యూ జ్వరాల సంఖ్య బయటకు పొక్కేలా చేసుకుని ప్రతిపక్షాల చేతిలో బుక్ అవుతున్నారు. ఓ వారం పాటు చంద్రబాబు వద్ద మేనేజ్‌మెంట్‌ క్లాస్‌లు తీసుకుంటే దేశంలో సమస్యలు ఉన్నా కనిపించవు. మొత్తం మీద డెంగ్యూ దోమ జనం మీద గెలిచి చంద్రబాబు చేతిలో ఓడిపోయినట్టే.

Click on Image to Read:

abk-prasad

mohan-babu

venkaiah-naidu

First Published:  17 Sept 2016 4:43 PM IST
Next Story