Telugu Global
NEWS

భూమనకు రెండో విడత...

వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డిని ప్రభుత్వం మరోసారి టార్గెట్‌ చేసింది. ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న సీఐడీ కార్యాయలంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. తుని ఘటనలో భూమనను సీఐడీ విచారించనుంది. భూమను ఈనెల 6,7 తేదీల్లో సీబీఐ విచారించింది. దాదాపు 16 గంటల పాటు తుని ఘటనలో ఆయన్ను ప్రశ్నించారు. అప్పట్లో ఆయన్ను అరెస్ట్ చేయడం దాదాపు ఖాయమని ప్రచారం జరిగింది.  విచారణకు హాజరైన సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి […]

భూమనకు రెండో విడత...
X

వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డిని ప్రభుత్వం మరోసారి టార్గెట్‌ చేసింది. ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న సీఐడీ కార్యాయలంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. తుని ఘటనలో భూమనను సీఐడీ విచారించనుంది. భూమను ఈనెల 6,7 తేదీల్లో సీబీఐ విచారించింది. దాదాపు 16 గంటల పాటు తుని ఘటనలో ఆయన్ను ప్రశ్నించారు. అప్పట్లో ఆయన్ను అరెస్ట్ చేయడం దాదాపు ఖాయమని ప్రచారం జరిగింది. విచారణకు హాజరైన సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి కూడా తాను అన్నింటికి సిద్దపడే వచ్చానని చెప్పారు. తనను కేసులో ఇరికించి జైలు పాలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే తొలివిడత విచారణ సమయంలో భూమన అరెస్ట్ జరగలేదు. ఇప్పుడు మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయడంపై వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. తుని ఘటనను అడ్డుపెట్టుకుని భూమనను ప్రభుత్వం వేధిస్తోందని వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే పదేపదే నోటీసులు జారీ చేస్తున్నారని విమర్శించింది. గతంలో భూమనతో పాటు మరో 19మంది కాపులకు సీఐడీ నోటీసులు జారీ చేసి విచారించింది. అయితే ఇప్పుడు మాత్రం భూమనకు మాత్రమే నోటీసులు జారీ అయినట్టు చెబుతున్నారు.

Click on Image to Read:

uma-reddy-venkateswarlu

geetha-scams

chittoor-mayor-katari-anuradha

First Published:  17 Sept 2016 8:34 AM IST
Next Story