నయీం అనుచరుల వేట మొదలైంది.. మాజీమంత్రి, ఎమ్మెల్యేకు నోటీసులు!
వినాయక నిమజ్జనం ముగిసింది. పోలీసులకు కాస్త ఉపశమనం లభించింది. ఇక నయీం అనుచరులపై దృష్టి సారించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యేలు నయీంతో అంటకాగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నగర శివార్లలో విలువైన భూములను సులువుగా సొంతం చేసుకునేందుకు వీరు హత్యలకు సైతం పాల్పడ్డట్లు తెలిసుకున్న సిట్ అధికారులు విస్తుపోయారట. నయీం ఎన్‌కౌంటర్ తరువాత నగరంలో ఎవరికీ కనిపించకుండా సదరు మాజీ మంత్రి అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక నగరానికే చెందిన మరో […]
BY sarvi15 Sept 2016 10:53 PM GMT
X
sarvi Updated On: 16 Sept 2016 1:11 AM GMT
వినాయక నిమజ్జనం ముగిసింది. పోలీసులకు కాస్త ఉపశమనం లభించింది. ఇక నయీం అనుచరులపై దృష్టి సారించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యేలు నయీంతో అంటకాగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నగర శివార్లలో విలువైన భూములను సులువుగా సొంతం చేసుకునేందుకు వీరు హత్యలకు సైతం పాల్పడ్డట్లు తెలిసుకున్న సిట్ అధికారులు విస్తుపోయారట. నయీం ఎన్‌కౌంటర్ తరువాత నగరంలో ఎవరికీ కనిపించకుండా సదరు మాజీ మంత్రి అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక నగరానికే చెందిన మరో ఎమ్మెల్యే నగరంలో తాను చేసే కార్యక్రమాలకు నయీంను యధేచ్ఛగా వాడాడని ఫోన్‌కాల్ డేటా ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. నగరంలోని నగలు, వజ్రాల వ్యాపారులకు నయీం ద్వారా ఫోన్ చేయించి దాదాపు రూ.30 కోట్ల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడ్డట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
రాజేంద్రనగర్ శివార్లలో కర్ణాటకు చెందిన ఓ బిల్డర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అది ప్రమాదం కాదని పోలీసులు గుర్తించారు. బిల్డర్ కొనుగోలు చేసిన 8 ఎకరాల భూమిని సదరు మంత్రి తక్కువ ధరకు అమ్మాలని ఒత్తిడి చేశాడు. ఐటీకారిడార్, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అతిసమీపంలో ఉన్న ఈ వెంచర్‌ను అమ్మేందుకు బిల్డర్ నిరాకరించాడు. దీంతో అతన్ని నయీం చేత కిడ్నాప్ చేయించి హింసించాడు. చిత్రహింసలకు తట్టుకోలేక బిల్డర్ ప్రాణాలు విడిచాడు. తరువాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఇప్పుడు ఈ కేసు సదరు మాజీ మంత్రి ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.
నయీంతో కలిసి సదరు నగర ఎమ్మెల్యే కూడా ఓ హత్య చేయించినట్లు తెలిసింది. ఉప్పల్ సమీపంలో జరిగిన ఓ హత్య ను నగర ఎమ్మెల్యేనే చేయించాడని పోలీసులు గుర్తించారు. అది కూడా బిల్డర్ దే కావడం విశేషం. ఇప్పుడు ఈ రెండు హత్యల విషయం, నయీంతో సంబంధాల విషయంలో పోలీసులు వీరిద్దరికీ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వీరు నగరం, దేశం విడిచిపారిపోకుండా నిఘాను కట్టుదిట్టం చేశారు. ఎప్పటికప్పుడు వీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న సమాచారాన్ని నిరంతరం తెలుసుకుంటున్నారు. ఏక్షణాల్లోనైనా వీరికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం.
Next Story