సైకిల్ పార్టీ ముక్కలవడం ఖాయమేనా?
సమాజ్ వాదీపార్టీ చీలికదిశగా వెళుతోందా.. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివ్‌పాల్‌సింగ్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యాడా? జరుగుతున్న పరిణామాలు చూస్తోంటే.. ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ములాయం కుమారుడు అఖిలేష్ శివ్‌పాల్ అనుచరులైన మంత్రులను భర్తరఫ్ చేయడంతో నిప్పు రాజుకుంది. దీన్ని బాబాయ్ శివపాల్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదిచాలదన్నట్లుగా శివపాల్‌కు బాగా కావాల్సిన మరో ఐఏఎస్‌ను కూడా అఖిలేష్ ఉన్నపలంగా విధులనుంచి తప్పించాడు. దీంతో శివ్‌పాల్ అన్న ములాయం వద్ద పంచాయతీ పెట్టాడు. […]
BY sarvi16 Sept 2016 5:36 AM IST
X
sarvi Updated On: 16 Sept 2016 11:59 AM IST
సమాజ్ వాదీపార్టీ చీలికదిశగా వెళుతోందా.. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివ్‌పాల్‌సింగ్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యాడా? జరుగుతున్న పరిణామాలు చూస్తోంటే.. ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ములాయం కుమారుడు అఖిలేష్ శివ్‌పాల్ అనుచరులైన మంత్రులను భర్తరఫ్ చేయడంతో నిప్పు రాజుకుంది. దీన్ని బాబాయ్ శివపాల్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదిచాలదన్నట్లుగా శివపాల్‌కు బాగా కావాల్సిన మరో ఐఏఎస్‌ను కూడా అఖిలేష్ ఉన్నపలంగా విధులనుంచి తప్పించాడు. దీంతో శివ్‌పాల్ అన్న ములాయం వద్ద పంచాయతీ పెట్టాడు. తనను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న కుమారుడిపై ములాయం ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి అఖిలేశ్‌ను తప్పించి ఆ స్థానంలో తమ్ముడు శివపాల్‌ను కూర్చోబెట్టారు. దీంతో అఖిలేశ్ ను సమర్థిస్తోన్న సీనియర్ మంత్రులు ఈ పరిణామంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అఖిలేశ్ ను తప్పించే ముందు కనీసం సమాచారం ఇచ్చి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. పార్టీలో కొత్తగా చేరిన వారే (అమర్‌సింగ్) ఈ పరిణామాలకు కారణమని అఖిలేశ్ సహా అతని మద్దతుదారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ పరిణామంపై శివ్‌పాల్ సింగ్ వర్గం వాదన మరోలా ఉంది. కొత్తగా వచ్చిన వారు ఎవరైతే మీకేంటి? అని వాదిస్తున్నారు. దీంతో అమర్‌సింగ్ కు మద్దతు లభించినట్లయింది. జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ నుంచి హుటాహుటాన లక్నో వచ్చిన ములాయం బాబాయ్- అబ్బాయ్‌లతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. శివ్‌పాల్ సింగ్ తనమంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అతని బాటలోనే ఆయన భార్య, కుమారుడు నడవడం గమనార్హం. మరోవైపు ములాయం తమ్ముడి రాజీనామాను ఆమోదించలేదు. అయినా శివ్‌పాల్ వెనక్కి తగ్గడం లేదు. అఖిలే శ్ కేబినేట్ నుంచి తప్పించిన మంత్రులతో సమావేశమయ్యారు. ఈ పరిణామంతో ములాయం మరింత మనస్తాపానికి గురయ్యారు. ఎలాగైనా తమ్ముడు వేరుపడకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. శివ్‌పాల్ నిజంగా కొత్త పార్టీ పెడితే.. ములాయం సింగ్ యాదవ్ ప్రధాని కావాలన్న కోరిక ఇక కలగానే మిగులుతుందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
Next Story