ఉత్తమ్ పార్టీని ఏకతాటిపైకి తెస్తున్నాడా?
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీపై క్రమంగా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా కనిపించిన అసంతృప్తి జ్వాలలు, సెగలు కొన్ని వారాలుగా కనిపించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తరువాత పార్టీలో ఉత్తమ్ బలం మరింత పెరిగింది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తరువాత ఉత్తమ్ దూకుడు పెంచారు. మరోవైపు పార్టీలోని సీనియర్లంతా ఆయనతో కలిసి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కొన్నివారాలుగా ఆయన ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో […]
BY sarvi14 Sept 2016 9:00 PM GMT
X
sarvi Updated On: 14 Sept 2016 11:29 PM GMT
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీపై క్రమంగా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా కనిపించిన అసంతృప్తి జ్వాలలు, సెగలు కొన్ని వారాలుగా కనిపించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తరువాత పార్టీలో ఉత్తమ్ బలం మరింత పెరిగింది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తరువాత ఉత్తమ్ దూకుడు పెంచారు. మరోవైపు పార్టీలోని సీనియర్లంతా ఆయనతో కలిసి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కొన్నివారాలుగా ఆయన ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో లోపాలున్నాయని గట్టిగా వాదించలగలుగుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులు, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, ప్రభుత్వ పథకాల అనుసరిస్తున్న తీరు, కొత్త జిల్లాలపై ఆయన ప్రభుత్వంపై ఏకంగా యుద్ధమే ప్రకటించినట్లు కనిపిస్తోంది. ఈ విషయాలను జాతీయ స్థాయిలో తీసుకుపోవడమే ఇందుకు నిదర్శనం.
సార్వత్రిక ఎన్నికలకు టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య బాధ్యతలు చేపట్టారు. ఆయన రెడ్లను కాదని బీసీలకు పెద్దపీట వేశారని అందుకే పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలైందన్న విమర్శలు వచ్చాయి. తరువాత పార్టీలో అసంతృప్తుల సెగలు పెరిగిపోయాయి. వీటిని అణిచివేయడంలో పొన్నాల విఫలమయ్యాడు. దీంతో పార్టీని తిరిగి రెడ్ల చేతిలోనే పెట్టాలనుకుంది. అందుకే రాజీవ్‌గాంధీకి సన్నిహితుడిగా పేరొందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పింది అధిష్టానం. ఉత్తమ్ బాధ్యతలు చేపట్టేనాటికి పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది. వరంగల్ పార్లమెంటు, నారాయణఖేడ్, పాలేరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక సీనియర్లంతా అలగడం, మరికొందరు వరుసపెట్టి కారెక్కడంతో ఉత్తమ్ సామర్థ్యంపై అనుమానాలు వచ్చాయి. అయినా పార్టీ చీఫ్‌గా ఉత్తమ్‌నే కొనసాగించింది.
అధిష్టానం నిర్ణయంతో సీనియర్లంతా ఇక ఉత్తమ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మానేశారు. అధికార పార్టీపై చేపట్టిన ఆందోళనలకు అంతా కలిసి వస్తున్నారు. నెమ్మదిగా పార్టీలోని ఇబ్బందులను,అసంతృప్తులను ఉత్తమ్ తన దారికి తెచ్చుకోగలిగాడు. అందుకే, అధికారపార్టీకి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీలో పునరుజ్జీవం నింపే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. త్వరలోనే పార్టీలోకి పూర్తిగా యువరక్తాన్ని ఎక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. జిల్లాలోని ప్రతి గ్రామస్థాయిలోనూ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.
Next Story