Telugu Global
Cinema & Entertainment

శ్రీకాంత్ కొడుక్కి నాని ఝలక్...

శ్రీకాంత్ కొడుకు రోషన్ ను హీరోగా ప్రవేశపెట్టడానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. మరికొన్ని గంటల్లో శ్రీకాంత్ తనయుడు రోషన్ వెండితెరపై సందడి చేయబోతున్నాడు. హీరోగా డెబ్యూ మూవీతో అందర్నీ అలరించడానికి రెడీ అయిపోయాడు. రోషన్ కోసం నాగ్ చేయాల్సిందంతా చేశాడు. గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశాడు. మ్యాగ్జిమమ్ థియేటర్లు ఆక్రమించాడు. అయితే ప్రస్తుతానికి నాగార్జున, రోషన్ చేతిలో ఉన్నది కేవలం వారం రోజులు మాత్రమే. అవును.. ఈ 7 రోజుల్లోనే నిర్మలా కాన్వెంట్ సినిమాతో నాగార్జున […]

శ్రీకాంత్ కొడుక్కి నాని ఝలక్...
X

శ్రీకాంత్ కొడుకు రోషన్ ను హీరోగా ప్రవేశపెట్టడానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. మరికొన్ని గంటల్లో శ్రీకాంత్ తనయుడు రోషన్ వెండితెరపై సందడి చేయబోతున్నాడు. హీరోగా డెబ్యూ మూవీతో అందర్నీ అలరించడానికి రెడీ అయిపోయాడు. రోషన్ కోసం నాగ్ చేయాల్సిందంతా చేశాడు. గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశాడు. మ్యాగ్జిమమ్ థియేటర్లు ఆక్రమించాడు. అయితే ప్రస్తుతానికి నాగార్జున, రోషన్ చేతిలో ఉన్నది కేవలం వారం రోజులు మాత్రమే. అవును.. ఈ 7 రోజుల్లోనే నిర్మలా కాన్వెంట్ సినిమాతో నాగార్జున లాభాలు, రోషన్ హీరోగా పేరు సంపాదించుకోవాలి. లేదంటే ఆ తర్వాత కష్టం. ఎఁదుకంటే… నాని దూసుకొస్తున్నాడు. ఇప్పటికే వరుసగా 3 హిట్స్ తో ఊపుమీదున్న ఈ నేచురల్ స్టార్… నిర్మలా కాన్వెంట్ విడుదలైన సరిగ్గా వారం రోజులకు మజ్నుగా థియేటర్లలోకి రావడానికి రెడీ అయిపోయాడు. నాగ్-రోషన్ కు పోటీగా… వాళ్లతో సమానంగా ప్రమోషన్ కూడా షురూ చేశాడు. సో… రోషన్ కు ఉన్నది సరిగ్గా వారం రోజులు టైం మాత్రమే. ఆ 7 రోజుల్లో తనను తాను ప్రూవ్ చేసుకుంటే.. ఆ తర్వాత నాని వచ్చినా నిర్మలా కాన్వెంట్ ను ఎవరూ ఆపలేరు. ఆల్ ది బెస్ట్ రోషన్.

First Published:  15 Sept 2016 11:34 AM IST
Next Story