Telugu Global
Cinema & Entertainment

ప్రియాంక చోప్రా  మాట‌లు వింటే మ‌తి పోవాల్సిందే..!

హీరోయిన్స్ కొన్నివిషయాలు మాట్లాడటానికి ముందూ వెనక ఆలోచిస్తారు. ముఖ్యంగా బ్రా, ప్యాంటి, లెగ్గింగ్స్ వేసుకోవటం గురించి, బెడ్ రూం గురించి మాట్లాడటానికి ధైర్యం చేయరు. కానీ ప్రియాంక చోప్రా వీటికి విరుద్దం. తన మాటలతోనే అందరినీ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ప్రియాంకచోప్రా చేసిన హంగామాతో మరోసారి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. బాలీవుడ్ లో ఉన్నపుడే ప్రియాంక చోప్రా మామూలుగా హంగామా చేసేది కాదు. తన గ్లామర్, పెర్ఫామెన్స్, స్కిన్ […]

ప్రియాంక చోప్రా  మాట‌లు వింటే మ‌తి పోవాల్సిందే..!
X

హీరోయిన్స్ కొన్నివిషయాలు మాట్లాడటానికి ముందూ వెనక ఆలోచిస్తారు. ముఖ్యంగా బ్రా, ప్యాంటి, లెగ్గింగ్స్ వేసుకోవటం గురించి, బెడ్ రూం గురించి మాట్లాడటానికి ధైర్యం చేయరు. కానీ ప్రియాంక చోప్రా వీటికి విరుద్దం. తన మాటలతోనే అందరినీ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ప్రియాంకచోప్రా చేసిన హంగామాతో మరోసారి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. బాలీవుడ్ లో ఉన్నపుడే ప్రియాంక చోప్రా మామూలుగా హంగామా చేసేది కాదు.

తన గ్లామర్, పెర్ఫామెన్స్, స్కిన్ షో.. వీటితో ఆకట్టుకునేది, అదరకొట్టేది. ముఖ్యంగా గ్లామర్ విషయంలో ముందూ వెనకా ఆలోచించే అలవాటు ఈ భామకు పెద్దగా లేకపోవటం మనందరికీ తెలిసిందే. ఏదన్నా అంటే కేరక్టర్ డిమాండ్ చేసిందంటూ తప్పించుకోవటానికి ఆమె దగ్గర ఆన్సర్ రెడీగా ఉండేది. దాంతో బాలీవుడ్ లో ప్రియాంకచోప్రా.. ఏం చేయడానికైనా రెడీ అన్నట్లుగా ఉంటుంది అనే ప్రచారం జరిగిపోయింది. ఇక ఇప్పుడు హాలీవుడ్ వెళ్లడంతో.. ఈ సుందరాంగి సొగసులు చూసేందుకు ఫ్యాన్స్ కి రెండు కళ్లు చాలడం లేదు.

ప్యాంట్స్,లెగ్గింగ్స్ ధరించటం గురించి అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ… “నేను లెగ్గింగ్స్ ని ఇష్టపడతాను,అవి ఇబ్బందిపెట్టవు,కంఫర్ట్ గా ఉంటాయి.” అంటూ చెప్పుకొచ్చింది. తన లో దుస్తులు గురించి ఆమె ఇలా మాట్లాడటం ఇండియన్స్ కు ఆశ్చర్యం అయ్యింది కానీ ఇతరదేశ మీడియాల్లో ఇవన్నీ కామన్.

క్రితం సంవత్సరం మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌ని ప్రకటించిన ప్రముఖ పత్రిక, తాజాగా మోస్ట్ డిజైరబుల్ విమెన్-2015 జాబితాను ప్రకటించింది. మొత్తం 21.35 లక్షల మంది పాల్గొన్న ఓటింగ్‌లో ప్రియాంక చోప్రాకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఈ విషయంలో ప్రియాంక చోప్రా చాలా ఆనందం ప్రకటించింది. మరి ఆమెనే డిజైరబుల్ ఉమెన్ గా ప్రకటించటం అంటే మాటలా. ఏది ఏమైనా ప్ర‌స్తుతం గ్లామ‌ర్ వర‌ల్డ్ లో ప్రియాంక టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది.

First Published:  15 Sept 2016 10:47 AM IST
Next Story